OTT Today: ఓటీటీలోకి ఒకే రోజు 9 సినిమాలు, వెబ్ సిరీస్.. తెలుగులో రెండు.. ఓ సూపర్ హిట్ సిరీస్ మూడో సీజన్ కూడా..
OTT Today: ఓటీటీలోకి ఈ శుక్రవారం (మార్చి 13) ఒక్క రోజే 9 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రాబోతున్నాయి. వాటిలో రెండు తెలుగు మూవీస్ ఉన్నాయి. అంతేకాదు ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
ఈ శుక్రవారం (మార్చి 13) ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. ఒకే రోజు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ యానిమేషన్ మూవీస్ కూడా డిజిటల్ తెరపైకి వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా మీకోసం.

ఆస్పిరెంట్స్ - సీజన్ 3 (Aspirants Season 3)
ఎక్కడ చూడాలంటే: అమెజాన్ ప్రైమ్ వీడియో
యూపీఎస్‌సీ అభ్యర్థుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ మూడవ సీజన్ శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా (సందీప్ భయ్యా) పాత్రలు ఈసారి ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎక్కడ చూడాలంటే: జీ5 (ZEE5)
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. వైన్ వ్యాపారిగా ఉండే రామ్ సత్యనారాయణ (రవితేజ), తన భార్య, మరొక మహిళ మధ్య చిక్కుకుని పడే ఇబ్బందులను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీని జీ5లో చూడొచ్చు.
ఫంకీ (Funky)
ఎక్కడ చూడాలంటే: నెట్‌ఫ్లిక్స్
కె.వి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మెటా-కామెడీ మూవీ ఒక సినిమా మేకర్ చుట్టూ తిరుగుతుంది. రూ.4 కోట్ల బడ్జెట్ కాస్తా రూ.40 కోట్లు దాటితే, ఆ తర్వాత వచ్చే పరిణామాలను కామెడీగా మలిచారు. ఇందులో నరేశ్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
జూటోపియా 2 (Zootopia 2)
ఎక్కడ చూడాలంటే: జియో హాట్‌స్టార్
చిన్నారులతో పాటు పెద్దలను కూడా అలరించిన పాపులర్ యానిమేషన్ మూవీ 'జూటోపియా' సీక్వెల్ ఇది. జూడీ హాప్స్, నిక్ వైల్డ్ జోడీ మరోసారి సిటీలోని కొత్త మిస్టరీలను ఛేదించనున్నారు. ఈ మూవీ జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనుంది.
ల్యాండ్‌లార్డ్ (Landlord)
ఎక్కడ చూడాలంటే: జీ5 (ZEE5)
కన్నడ స్టార్ దునియా విజయ్ దర్శకత్వం వహించి నటించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 1980-90ల నాటి కోలార్ నేపథ్యంతో సాగుతుంది. భూస్వాములకు, కూలీలకు మధ్య జరిగే పోరును ఇందులో చూడవచ్చు. జీ5లోకి వస్తోంది.
ద తాజ్ స్టోరీ (The Taj Story)
ఎక్కడ చూడాలంటే: లయన్స్ గేట్ ప్లే
పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 'తాజ్ మహల్' చరిత్ర, దాని చుట్టూ ఉన్న చట్టపరమైన, సామాజిక వివాదాల నేపథ్యంలో సాగుతుంది. లయన్స్‌గేట్‌ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇవే కాకుండా నాంగల్ (Naangal) అనే మరో మూవీ సన్ నెక్ట్స్ లోకి వస్తోంది. ముగ్గురు సోదరులు, వారి కుక్క 'కైతీ' చుట్టూ తిరిగే తమిళ సెమీ-ఆటోబయోగ్రాఫికల్ సినిమా.
ఇక తమిళ రొమాంటిక్ మూవీ పూకీ (Pooki) జీ5లోకి వస్తోంది. నేటి తరం అంటే జెన్ జీ లవ్ స్టోరీలను ప్రతిబింబించే ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది.
రిసార్ట్ (Resort) అనే మరో తమిళ వెబ్ సిరీస్ కూడా జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఒక రిసార్ట్ కిచెన్ లో తన టాలెంట్ నిరూపించుకోవాలనుకునే యువకుడి కథతో సాగే సిరీస్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


