OTT Malayalam: ఓటీటీలోకి అదిరిపోయే మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. జోజు జార్జ్ ఊచకోత.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Malayalam: ఓటీటీలోకి మరో ఇంటెన్స్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.
OTT Malayalam: మలయాళ వర్సటైల్ యాక్టర్ జోజు జార్జ్ లీడ్ రోల్‌లో నటించిన రా యాక్షన్ థ్రిల్లర్ 'వరవు' (Varavu) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ రివేంజ్ డ్రామా సెప్టెంబర్ 11 నుంచి జీ5 (ZEE5) ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

పాత శత్రుత్వాలు.. నరనరాలు తెగే రివేంజ్ డ్రామా
ఈ వరవు సినిమా కథ విషయానికి వస్తే.. ఊరు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి చాలా కాలం తర్వాత మళ్లీ తన సొంత గ్రామానికి తిరిగి రావడం చుట్టూ తిరుగుతుంది. అతను తిరిగి రావడంతో చాలా ఏళ్లుగా మరుగున పడిపోయిన పాత పగలు, కుటుంబాల మధ్య శత్రుత్వాలు మళ్లీ రగులుతాయి.
ఊరిలోని ప్రతీకార జ్వాలలు, పవర్‌ఫుల్ ముఠాల మధ్య జరిగే ఘర్షణలకు హీరో ఎలా చెక్ పెట్టాడనేది దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. జులై 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మాస్ యాక్షన్ లవర్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం.
'జోసెఫ్', 'ఇరట్టా', పని లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జోజు జార్జ్.. ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టారు. ఆయన బాడీ లాంగ్వేజ్, రస్టిక్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
వాణి విశ్వనాథ్ కంబ్యాక్.. క్రేజీ స్టార్ కాస్టింగ్
అర్జున్ అశోకన్, మురళి గోపి, బాబురాజ్, బైజు సంతోష్ లాంటి క్రేజీ ఆర్టిస్టులతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూడా పవర్‌ఫుల్ రోల్‌లో మెరిశారు. షనియా ఇయ్యప్పన్, అభిమన్యు శమ్మి తిలకన్, బాబీ కురియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిగ్గజ దర్శకుడు షాజీ కైలాస్ ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఏకే సాజన్ రాసిన సీట్ ఎడ్జ్ స్క్రీన్‌ప్లేకి ఎస్ శరవణన్ సినిమాటోగ్రఫీ, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ ప్రధాన బలంగా నిలిచాయి.
నెక్స్ట్ లెవెల్ ఫైట్స్.. సామ్ సీఎస్ మాస్ మ్యూజిక్
యాక్షన్ సన్నివేశాల కోసం ఏకంగా స్టంట్ సిల్వా, కలై కింగ్సన్, ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్ మాస్టర్ లాంటి భారీ ఫైట్ మాస్టర్ల బృందం పనిచేసింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ అందించిన ఎలివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ ఫైట్ సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది.
ఓల్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నైసీ రెజీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జోమీ జోసెఫ్, రాహుల్ రెజీ థామస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో నాలుగు దక్షిణాది భాషల్లో రాబోతున్న ఈ సినిమా ఓటీటీ యాక్షన్ ప్రియులకు బెస్ట్ ఛాయిస్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన మూవీ లవర్స్ ఈ వీకెండ్ జీ5 ఓటీటీలో డిజిటల్ రైడ్‌కి రెడీ అయిపోవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


