OTT Telugu: మిడిల్ క్లాస్ మ్యాన్ రాత మార్చే పుస్తకం.. ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా.. శ్రీకాంత్, లయ మూవీని ఇక్కడ చూడండి

Mister Middle Class OTT Release Date: ఓటీటీలోకి శ్రీకాంత్, లయ నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ కామెడీ డ్రామా ఆగస్ట్ 19 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Aug 18, 2026, 20:23:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mister Middle Class OTT Release Date: ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, హోమ్‌లీ బ్యూటీ లయ కాంబినేషన్ అనగానే మనకి 'స్వరాభిషేకం', నేను పెళ్లికి రెడీ, దొంగరాముడు అండ్ పార్టీ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ తెరపై అలరించిన సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మిడిల్ క్లాస్' ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను పలకరించేందుకు సిద్ధమైంది. లోకల్ తెలుగు ఓటీటీ దిగ్గజం 'ఆహా' వేదికగా ఈ సినిమా ఆగస్టు 19న అంటే రేపే (బుధవారం) గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

OTT Telugu: మిడిల్ క్లాస్ మ్యాన్ రాత మార్చే పుస్తకం.. ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా.. శ్రీకాంత్, లయ మూవీని ఇక్కడ చూడండి
OTT Telugu: మిడిల్ క్లాస్ మ్యాన్ రాత మార్చే పుస్తకం.. ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా.. శ్రీకాంత్, లయ మూవీని ఇక్కడ చూడండి

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి

జులై 17న థియేటర్లలో విడుదలైన మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి మార్క్ టైమింగ్, సోషియో ఫాంటసీ ట్విస్టులు ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ ఆడియన్స్ ముందుకు ఆహా ఓటీటీ ద్వారా వస్తోంది.

అసలు కథేంటి? కన్ఫ్యూజన్ ఫన్ ఎలా ఉందంటే..

సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వెంకటరమణ (శ్రీకాంత్) కథ ఇది. ఆర్థిక ఇబ్బందులు, బిజినెస్ లాస్‌లతో సతమతమయ్యే వెంకటరమణ జీవితంలోకి స్వయంగా వెంకటేశ్వర స్వామి ప్రవేశిస్తాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ వేంకటేశ్వరుడి పాత్రలో అలరించారు.

దేవుడు ఇచ్చే ఒక మ్యాజికల్ బుక్ వెంకటరమణ చేతికి వస్తుంది. ఆ పుస్తకంలో ఏ కోరిక రాసినా సరే, అది నిజమైపోతుంది. అయితే ఆ వింత పుస్తకం అనుకోకుండా వేరే వాళ్ల చేతుల్లోకి మారితే ఎలాంటి గందరగోళం జరిగింది? దాన్ని తిరిగి దక్కించుకోవడానికి వెంకటరమణ పడిన పాట్లు ఏంటి అనేదే అసలు స్టోరీ.

శ్రీకాంత్-లయ కంబ్యాక్.. నవ్వుల రేంజ్ పెంచిన కమెడియన్లు

మిడిల్ క్లాస్ గృహిణిగా లయ తన నటనతో పాత రోజులను గుర్తుచేశారు. శ్రీకాంత్ తన మార్క్ కామెడీ విత్‌ ఎమోషన్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

దీనికితోడు సునీల్, అలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ రాజ్ లాంటి సీనియర్ కామిక్ గ్యాంగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించారు. డైలాగ్ రైటర్స్ డైమండ్ రత్నబాబు, శ్రావణ్ భానుపురి అందించిన వినోదాత్మక సంభాషణలు పక్కాగా వర్కవుట్ అయ్యాయి.

ఆహా వీడియో స్ట్రీమింగ్ వివరాలు

సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా గోవింద నామాలతో సాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్. 'గరుడవేగ' అంజీ ఛాయాగ్రహణం, బ్లూ.జే క్రియేషన్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు కుదిరాయి.

ఫ్యామిలీ అందరూ కలసి హాయిగా చూడదగ్గ క్లీన్ కామెడీ సినిమాల కోసం చూస్తున్న ఓటీటీ లవర్స్‌కు 'మిస్టర్ మిడిల్ క్లాస్' మంచి ఆప్షన్. ఆగస్టు 19 నుంచి ఆహాలో అందుబాటులోకి రానున్న ఈ చిత్రం డిజిటల్ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More