OTT Review: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన సంతోష్ శోభన్ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఓ హత్య, ఓ ఫ్యామిలీ.. ఎలా ఉందంటే?
OTT Review: ఓటీటీలోకి శుక్రవారం (జులై 10)న అడుగుపెట్టిన తమిళ కామెడీ థ్రిల్లర్ పరిమళ అండ్ కో మూవీ నవ్వులతోపాటు మంచి థ్రిల్ కూడా పంచుతోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ప్రస్తుతం జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Review: ఓటీటీలోకి ఈవారం వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల్లో పరిమళ అండ్ కో కూడా ఒకటి. ఈ తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమాలో సంతోష్ శోభన్, జయరాం, ఊర్వశిలాంటి వాళ్లు నటించారు. ఓ ఫ్యామిలీ, ఓ మర్డర్ చుట్టూ తిరుగుతూ కామెడీతోపాటు థ్రిల్ ను కూడా పంచుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూడండి. జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

పరిమళ అండ్ కో కథేంటంటే?
తమిళ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు కామెడీ టచ్ ఇచ్చి హిట్స్ కొట్టే పాండిరాజ్ (Pandiraj) డైరెక్ట్ చేసిన మూవీ ఈ పరిమళ అండ్ కో. ఇందులో పరిమళ అంటే ఓ మహిళ పేరు అనుకునేరు. జయరాం ఈ పాత్రలో నటించడం విశేషం. ఇక మరో సీనియర్ నటి ఊర్వశి అతని భార్య స్వరాజ్యం పాత్రలో జీవించేసింది.
పరిమళ (జయరామ్), అతడి భార్య స్వరాజ్యం (ఊర్వశి) ఇద్దరు కూతుళ్లు మధుమిత, పరాశక్తితో కలిసి ఓ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వీళ్ల ప్రశాంతమైన జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ కూతుళ్ల వెంటపడటమే కాకుండా, వాళ్లలో ఒకరిని కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు.
ఈ టార్చర్ భరించలేక అతన్ని చంపేస్తే బాగుంటుందని ఆ ఫ్యామిలీ సరదాగా ఒక వెకేషన్ ప్లాన్ లాగా మాట్లాడుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే, ఊహించని విధంగా వర్గీస్ హత్యకు గురవుతాడు. దాంతో ఈ ఫ్యామిలీ మొత్తం అనుమానితులుగా మారతారు.
అప్పుడు ఎంట్రీ ఇస్తాడు పోలీస్ ఆఫీసర్ ఎంపెరుమాన్ (మిస్కిన్). పానీపూరీలు, బజ్జీలు తింటూ చాలా క్యాజువల్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ఈ పోలీసు.. ఈ మిస్టరీని ఎలా పరిష్కరించాడు? అసలు ఆ హత్య చేసింది ఎవరు? నిజంగానే ఆ ఫ్యామిలీలోనే ఒకరు చేశారా? మరెవరైనా చేశారా అన్నదే మిగిలిన కథ.
ట్విస్టులు, నటీనటుల పర్ఫార్మెన్స్ హైలైట్
దర్శకుడు పాండిరాజ్ ఒక రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాకు మర్డర్ మిస్టరీ యాడ్ చేసి ఈ పరిమళ అండ్ కో మూవీని గ్రిప్పింగ్ గా తీశాడు. ఓ సాదాసీదా కుటుంబం, చిన్న చిన్న గొడవలతో హాయిగా గడిపే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓ హత్య కేసులో ఇరుక్కోవడం అనే కాన్సెప్ట్ ను ఫన్నీగా చూపించాడు.
చిన్న చిన్న ట్విస్టులు, కామెడీ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపిస్తాయి. ఈ సినిమాలో సీనియర్ నటీనటులు జయరాం, ఊర్వశి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక సంతోష్ శోభన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడు.
సెకండాఫ్ మైనస్
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా మొదటి అరగంట హాయిగా అనిపిస్తుంది. అయితే ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొట్టిస్తుంది. ఎడిటింగ్ కాస్త ఫాస్ట్ గా ఉండి ఉంటే సినిమా మరింత రక్తి కట్టించేది. డ్రగ్స్ అంటూ ఓ సబ్ ప్లాట్ తీసుకురావడం అనవసరం అనిపిస్తుంది.
సినిమా నిడివి 2 గంటల 2 నిమిషాలే అయినా.. రైటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది. అయితే ఈ వీకెండ్ లో ఏదైనా కాస్త డిఫరెంట్ గా చూడాలనుకుంటే మాత్రం ఈ పరిమళ అండ్ కో మంచి చాయిస్ అవుతుంది. జీ5 ఓటీటీలో ప్రస్తుతం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


