ఓటీటీలోకి ప్రతివారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయో ముందుగానే ఆయా ప్లాట్‌ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. ఈవారం కూడా అలా ఎన్నో మూవీస్, సిరీస్ రానున్నాయి. అయితే వాటిలో చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్, షోల జాబితాను మేము ఇక్కడ ఇస్తున్నాం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.
1. కుబేర - ప్రైమ్ వీడియో

ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీకుబేర. జూన్ 20న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (జులై 18) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ మూవీ అందించాడు. ఈ సినిమాను ఓటీటీలో మిస్ కావద్దు.
2. స్పెషల్ ఆప్స్ 2 - జియోహాట్‌స్టార్
ఇక ఈవారం ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ 2.0. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా వారం వాయిదా పడింది. జియోహాట్‌స్టార్ లో ఈ శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలి సీజన్, ఆ తర్వాత 1.5 అంటూ వచ్చిన ఓ షార్ట్ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ గా మరోసారి రాబోతున్నాడు.
3. భైరవం - జీ5 ఓటీటీ
ముగ్గురు హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జులై 18) జీ5 ఓటీటీలోకి అడుపెట్టనుంది. మే 30న రిలీజై ఈ మూవీ సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.
4. ది భూత్నీ - జీ5 ఓటీటీ
{{/usCountry}}ముగ్గురు హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జులై 18) జీ5 ఓటీటీలోకి అడుపెట్టనుంది. మే 30న రిలీజై ఈ మూవీ సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.
4. ది భూత్నీ - జీ5 ఓటీటీ
{{/usCountry}}ఈ వారం ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ మూవీ భూత్నీ (Bhootnii). ప్రముఖ బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్, మౌనీ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా శుక్రవారం (జులై 18) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మే 1న థియేటర్లలో మూవీ రిలీజైంది. రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
5. వీర్ దాస్ ఫూల్ వాల్యూమ్ - నెట్‌ఫ్లిక్స్
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న స్టాండప్ కామెడీ షో వీర్ దాస్ - ఫూల్ ప్రూఫ్. ప్రముఖ కమెడియన్, నటుడు వీర్ దాస్ హోస్ట్ చేస్తున్న ఈ షోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం (జులై 18) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.