ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఓ తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కూడా..

ఓటీటీలోకి ఈవారం అంటే జులై 14 నుంచి జులై 20 మధ్య కూడా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అయితే వీటిలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. వీటిలో తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కుబేర కూడా ఉంది.

Published on: Jul 14, 2025, 18:03:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ప్రతివారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయో ముందుగానే ఆయా ప్లాట్‌ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. ఈవారం కూడా అలా ఎన్నో మూవీస్, సిరీస్ రానున్నాయి. అయితే వాటిలో చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్, షోల జాబితాను మేము ఇక్కడ ఇస్తున్నాం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.

ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఓ తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కూడా..
ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఓ తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కూడా..

1. కుబేర - ప్రైమ్ వీడియో

ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీకుబేర. జూన్ 20న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (జులై 18) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ మూవీ అందించాడు. ఈ సినిమాను ఓటీటీలో మిస్ కావద్దు.

2. స్పెషల్ ఆప్స్ 2 - జియోహాట్‌స్టార్

ఇక ఈవారం ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ 2.0. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా వారం వాయిదా పడింది. జియోహాట్‌స్టార్ లో ఈ శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలి సీజన్, ఆ తర్వాత 1.5 అంటూ వచ్చిన ఓ షార్ట్ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ గా మరోసారి రాబోతున్నాడు.

3. భైరవం - జీ5 ఓటీటీ

ముగ్గురు హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జులై 18) జీ5 ఓటీటీలోకి అడుపెట్టనుంది. మే 30న రిలీజై ఈ మూవీ సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.

4. ది భూత్నీ - జీ5 ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ మూవీ భూత్నీ (Bhootnii). ప్రముఖ బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్, మౌనీ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా శుక్రవారం (జులై 18) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మే 1న థియేటర్లలో మూవీ రిలీజైంది. రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

5. వీర్‌ దాస్ ఫూల్ వాల్యూమ్ - నెట్‌ఫ్లిక్స్

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న స్టాండప్ కామెడీ షో వీర్ దాస్ - ఫూల్ ప్రూఫ్. ప్రముఖ కమెడియన్, నటుడు వీర్ దాస్ హోస్ట్ చేస్తున్న ఈ షోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం (జులై 18) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More