ఈవారం ఒకే ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ సినిమాలు.. ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్, మరొకటి మలయాళ థ్రిల్లర్ మూవీ

ఒకే ఓటీటీలోకి ఈ వారం రెండు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్ కాగా.. మరొకటి మలయాళం థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. మరి ఆ సినిమాలేంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Jun 23, 2025, 16:16:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే ఒక్క సన్ నెక్ట్స్ ఓటీటీలోకే రెండు రోజుల వ్యవధిలో రెండు సూపర్ హిట్ సినిమాలు రానుండటం విశేషం. వీటిలో ఒకటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ది వర్డిక్ట్ ఒకటి కాగా.. మరొకటి మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ.

ఈవారం ఒకే ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ సినిమాలు.. ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్, మరొకటి మలయాళ థ్రిల్లర్ మూవీ
ఈవారం ఒకే ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ సినిమాలు.. ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్, మరొకటి మలయాళ థ్రిల్లర్ మూవీ

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రెండు సినిమాలు

ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్ ఈవారం రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ముందుగా వచ్చే గురువారం (జూన్ 26) వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ డ్రామా ది వర్డిక్ట్ (The Verdict)ను తీసుకొస్తోంది. ఆ మరుసటి రోజే అంటే శుక్రవారం (జూన్ 27) మలయాళం థ్రిల్లర్ సినిమా ఆజాదీ (Azadi) కూడా ఈ ఓటీటీలోకే రానుంది.

ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ విషయాన్ని కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న సన్ నెక్ట్స్.. తాజాగా సోమవారం (జూన్ 23) మరోసారి తన ఎక్స్ అకౌంట్ లో ఈ విషయం తెలిపింది. ఈ రెండింటికీ థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. వీటిలో ఆజాదీ మూవీ ఇటు సన్ నెక్ట్స్ తోపాటు అదే రోజు మనోరమ మ్యాక్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది.

ది వర్డిక్ట్ మూవీ గురించి..

ది వర్డిక్ట్ మూవీని కృష్ణ శంకర్ డైరెక్ట్ చేశాడు. ఓ ధనవంతురాలైన ఓ అమెరికన్ మహిళను హత్య చేసినట్లుగా ఓ ఇండియన్ మహిళపై ఆరోపణలు వస్తాయి. ఆమెను ఎంతగానో ప్రేమించే భర్త.. తన భార్యను ఈ కేసు నుండి బయటపడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో నమ్రత అనే ఇండియన్ మహిళ పాత్రలో శృతి హరహరన్ నటించింది.

ఇక హత్యకు గురయ్యే అమెరికన్ మహిళ ఎలిజాగా సుహాసిని కనిపించింది. నమ్రత తరఫున కోర్టులో వాదించే లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ఓ కోర్ట్ రూమ్ డ్రామానే కాదు.. ఇందులో ఓ లవ్ స్టోరీ, రివేంజ్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉన్నాయని రిలీజ్ కు ముందు శృతి చెప్పింది.

ది వర్డిక్ట్ మూవీలో నమ్రత, ఎలిజా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఎలిజా తన వీలునామాను నమ్రతకు కూడా భారీ లబ్ధి చేకూరేలా రూపొందిస్తుంది. దీంతో ఎలిజా హత్యలో నమ్రతే ప్రధాన అనుమానితురాలిగా ఉంటుంది. మరి ఆమె నిజంగానే తన ఫ్రెండ్ ను చంపిందా లేదా అన్నదే ఈ ది వర్డిక్ట్ మూవీ కథ. అడ్వొకేట్ మాయ పాత్రలో వరలక్ష్మి నటించింది.

ఆజాదీ మూవీ గురించి..

ఆజాదీమూవీని జో జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మంజుమ్మెల్ బాయ్స్ మూవీ హీరో శ్రీనాథ్ భాసితోపాటు వాణీ విశ్వనాథ్, లాల్, సైజు కురుప్, రవీనా రవిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ కొట్టాయం మెడికల్ కాలేజీలోనే ఎక్కువగా ఉంటుంది. గంగా అనే ఓ మహిళ చుట్టూ తిరిగే కథ. గర్భవతి అయిన ఆమె ఓ రాజకీయ నేత కొడుకు హత్య కేసులో జైలుకు వెళ్తుంది.

అయితే ప్రసవం కోసం ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడి నుంచే ఆమెను తప్పించేందుకు భర్త ప్లాన్ చేస్తాడు. అయితే వాళ్ల గతం ఆ ప్లాన్ ను దెబ్బ తీస్తుంది. వాళ్ల ప్రత్యర్థులు ఆ హాస్పిటల్లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి వాళ్లు తప్పించుకోవడం కాదు కదా.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే కష్ట పడాల్సి వస్తుంది. మరి ఆ భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుంటారా లేదా అన్నదే ఈ ఆజాదీ మూవీ స్టోరీ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More