OTT Thriller: హత్యలు చేసే డెంటిస్ట్.. భర్తను చంపడానికి వాడుకొని వదిలేసే అమ్మాయి.. ఓటీటీలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూశారా?
OTT Thriller: ఓటీటీలో రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఫ్రెడ్డీ అనే మూవీ ఓ పర్ఫెక్ట్ వాచ్. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
OTT Thriller: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) తన కెరీర్లో చేసిన అత్యంత ప్రయోగాత్మక, ఉత్కంఠభరితమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫ్రెడ్డి' (Freddy). సాధారణంగా లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో మెప్పించే కార్తీక్.. ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన గ్రే షేడ్ క్యారెక్టర్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు డిజిటల్ స్క్రీన్‌పై ఒక సరికొత్త అనుభూతిని పంచిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.
శశాంక్ ఘోష్ (Shashank Ghosh) దర్శకత్వంలో బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బలమైన స్క్రిప్ట్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ చిత్రానికి ఐఎండీబీలో ఏకంగా 7.3 రేటింగ్ దక్కడం విశేషం.
ఫ్రెడ్డీ మూవీ స్టోరీ, మర్డర్ మిస్టరీ ట్విస్ట్
ఈ ఫ్రెడ్డీ మూవీ ఓ డెంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ ఫ్రెడ్డీ జిన్వాలా (కార్తీక్ ఆర్యన్) ఒక కామ్ గా ఉండే, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని డెంటిస్ట్. సమాజానికి దూరంగా ఒంటరిగా బతికే అతనికి స్నేహితులు కానీ, గర్ల్‌ఫ్రెండ్ కానీ ఉండరు. అలాంటి సమయంలో అతని క్లినిక్‌కి కాయనాజ్ ఇరానీ (అలయా ఎఫ్) అనే వివాహిత ట్రీట్మెంట్ కోసం వస్తుంది.
ఆమెను చూసిన తొలి చూపులోనే ఫ్రెడ్డి ప్రేమలో పడతాడు. అయితే కాయనాజ్ తన భర్త రుస్తమ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అతనితో కలిసి జీవించలేనని ఫ్రెడ్డికి చెబుతుంది.
తమ ప్రేమకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతొలగించుకుంటే ఇద్దరం కలసి బతకొచ్చని కాయనాజ్ సలహా ఇస్తుంది. ఆమె కోసం ప్రాణమిచ్చేందుకైనా సిద్ధపడే ఫ్రెడ్డి.. ఆమె భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆ మర్డర్ జరిగిన తర్వాతే అసలు కథలో ఊహించని ట్విస్ట్ బయటపడుతుంది.
క్లైమాక్స్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే
కాయనాజ్ అసలు ఫ్రెడ్డిని ప్రేమించలేదని, కేవలం తన భర్తను అంతమొందించడానికి ఆమె ఒక పావులా వాడుకుందని తెలుసుకున్న ఫ్రెడ్డి షాక్ అవుతాడు. ఆమెకు ముందే వేరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, ఈ హత్య కేసులో తనను బలిపశువును చేయాలని చూసిందని గ్రహిస్తాడు.
అక్కడి నుంచి ఎంతో కామ్ గా ఉండే స్వభావం కలిగిన డెంటిస్ట్ ఫ్రెడ్డి ఎలా పూర్తిగా మారిపోయాడు? తనను మోసం చేసిన కాయనాజ్ అండ్ గ్యాంగ్‌పై అతను ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.
సినిమా చివరి ముప్పై నిమిషాలు వచ్చే ట్విస్టులు, కార్తీక్ ఆర్యన్ కళ్లతో పలికించే క్రూరమైన హావభావాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. థ్రిల్లర్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


