ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ మూవీ.. ఇప్పటికే ప్రైమ్ వీడియో ఓటీటీలో..
ఓ తెలుగు కామెడీ మూవీ ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. గతేడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల లోపే ఓటీటీలోకి వచ్చినా.. ఇప్పుడు మరో ప్లాట్‌ఫామ్ లోకీ అందుబాటులోకి రానుంది.
అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. గతేడాది మే నెలలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (జూన్ 10) వెల్లడించింది.

ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ స్ట్రీమింగ్
ఆ ఒక్కటి అడక్కు మూవీ గతేడాది మే 31 నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గురువారం (జూన్ 12) నుంచి ఈటీవీ విన్ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
“కామెడీ, అయోమయం, పెళ్లి కోసం అన్వేషణ. అల్లరి నరేష్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉన్న, నవ్వులు, ఎమోషన్స్ రోలర్ కోస్టర్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీని చూడటానికి సిద్ధంగా ఉండండి. జూన్ 12న ఈటీవీ విన్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఓ ట్వీట్ చేసింది.
ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కు మల్లి అంకం దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మిక్స్‌డ్ రియాక్షన్స్ సొంతం చేసుకుందీ సినిమా. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. గణపతి (అల్లరి నరేష్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. 30 ఏళ్లు దాటినా పెళ్లికాదు. అతడికి వచ్చిన పెళ్లి సంబంధాలన్ని రిజెక్ట్ అవుతుంటాయి. ఓ సమస్య కారణంగా సిద్ధిని (ఫరియా అబ్దుల్లా) తన ప్రియురాలిగా కుటుంబసభ్యులకు పరిచయం చేస్తాడు గణపతి. మ్యాట్రిమెనీ పేరుతో అబ్బాయిలకు వలవేస్తూ మోసాలకు పాల్పడుతుందంటూ సిద్ధి గురించి పేపర్లలో న్యూస్ వస్తుంది.
సిద్ధి గురించి వచ్చిన ఆ వార్త నిజమేనా? ఆ సమస్య నుంచి ఆమెను గణపతి ఎలా గట్టెక్కించాడు? గణపతి పెళ్లి ప్రపోజల్‌ను మొదట తిరస్కరించిన సిద్ధి ఆ తర్వాత అతడితో ఎలా ప్రేమలో పడిందన్నదే ఈ మూవీ కథ. పెళ్లి వయసు దాటినా సంబంధాలు కుదరక అబ్బాయిలు పడే ప్రస్టేషన్‌ను దర్శకుడు ఈ మూవీలో వినోదాత్మకంగా చూపించాడు. అయితే అదే స్థాయిలో సినిమా కామెడీ మొత్తం వర్కవుట్ కాలేదు. రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు.. కేవలం రూ.9.35 కోట్లు మాత్రమే వచ్చాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



