ఓటీటీల్లోకి ఈ వారం వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు.. మరో యాక్షన్ చిత్రం డబ్బింగ్‍లోనూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈవారం ఓటీటీల్లోకి మూడు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఇందులో ఒకటి బ్లాక్‍బస్టర్ కామెడీ మూవీ ఉంది. ఓ బాలీవుడ్ యాక్షన్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది.

Published on: Jun 07, 2025 10:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో కొత్తగా తెలుగు సినిమాలు చూడాలనుకుంటే ఈ జూన్ తొలి వారంలో కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. శ్రీవిష్ణు బ్లాక్‍బస్టర్ మూవీ సింగిల్ ఈ వారమే అడుగుపెట్టింది. మరో రెండు కామెడీ సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బాలీవుడ్ మూవీ జాట్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు సినిమాలు ఇవే..

ఓటీటీల్లోకి ఈ వారం వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు.. ఓ యాక్షన్ చిత్రం డబ్బింగ్‍లోనూ..
ఓటీటీల్లోకి ఈ వారం వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు.. ఓ యాక్షన్ చిత్రం డబ్బింగ్‍లోనూ..

సింగిల్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన సింగిల్ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 6) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మే 9వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రూ.14కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను దక్కించుకొని సక్సెస్ కొట్టింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ ప్రధానంగా సాగే సింగిల్మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ రాజు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు.

పెళ్లి కాని ప్రసాద్

తెలుగు కామెడీ డ్రామా ‘పెళ్లి కాని ప్రసాద్’ చిత్రం ఈ గురువారం జూన్ 5వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. అయితే, అనుకున్న రేంజ్‍లో విజయం సాధించలేకపోయింది. ఎట్టకేలకు రెండు నెలలు దాటిన తర్వాత ఈటీవీ విన్‍లోకి పెళ్లి కాని ప్రసాద్ అడుగుపెట్టింది. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సప్తగిరి సరసన ప్రియాంక శర్మ హీరోయిన్‍గా చేశారు.

జాట్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ చిత్రం జూన్ 5న నెట్ఫ్లిక్స్ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఈ బాలీవుడ్ యాక్షన్ మూవీకి తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలై రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో ఓ మోస్తరు హిట్ సాధించింది. ఈ జాట్ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్ హౌస్‍లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూజ్ చేశాయి.

జిగేల్

తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ మూవీ జూన్ 5వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో త్రిగుణ్, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మల్లి ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు.