ఓటీటీలో ది బెస్ట్ 8 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో రకం.. అన్నీ తెలుగులోనే.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారంలో తెలుగు భాషలో ది బెస్ట్ 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ హారర్, క్రైమ్, రొమాంటిక్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Jun 23, 2025, 05:34:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఈ వారం తెలుగు భాషలో ది బెస్ట్ 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, రొమాంటిక్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ తెలుగు సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలో ది బెస్ట్ 8 సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- అన్నీ తెలుగులోనే- ఇక్కడ చూడండి!
ఓటీటీలో ది బెస్ట్ 8 సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- అన్నీ తెలుగులోనే- ఇక్కడ చూడండి!

యుద్ధకాండ చాప్టర్ 2 ఓటీటీ

కన్నడలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా లీగల్ థ్రిల్లర్ సినిమా యుద్ధకాండ చాప్టర్ 2. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్లో యుద్ధకాండ చాప్టర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

ఘటికాచలం ఓటీటీ

తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో బాల నటుడు నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఘటికాచలం ఓటీటీ స్ట్రీమింగ్అవుతోంది.

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 ఓటీటీ

మలయాళంలో తొలిసారి రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. జూన్ 20 నుంచి తెలుగుతో సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

అలప్పుళ జింఖానా ఓటీటీ

ప్రేమలు హీరో నస్లెన్ నటించిన తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుల జింఖానా సోనీ లివ్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జూన్ 20న మరో ఓటీటీ ఆహాలో అలప్పుళ జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం రెండు ఓటీటీల్లో ఈ సినిమాను తెలుగులో వీక్షించవచ్చు.

కలియుగమ్ 2064 ఓటీటీ

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కలియుగమ్ 2064. ఈ మూవీ జూన్ 20 నుంచి సౌత్ సింప్లీ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

కే-పాప్: ది డీమన్ హంటర్స్ ఓటీటీ

అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన సినిమా కే-పాప్: ది డీమన్ హంటర్స్. యాక్షన్ లవర్స్ ఇష్టపడే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 20న తెలుగు భాషలోనూ విడుదలైంది.

ఒక బృందావనం ఓటీటీ

తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఒక బృందావనం. జూన్ 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఒక బృందావనం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఏవి అలనాటి ముద్దులు ఓటీటీ

ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమా ఏవి అలనాటి ముద్దులు. బిగ్ బాస్ అర్జున్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ జూన్ 22 నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వీకెండ్‌కు బెస్ట్

ఈ ఒక్క ఏవి అలనాటి ముద్దులు సినిమా తప్పా మిగతా ఏడు మూవీస్ అన్ని ఒక్క జూన్ 20న ఓటీటీ రిలీజ్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలు వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More