OTT Thriller: ఇవాళ ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్లు.. ఒకటేమో మలయాళ రొమాంటిక్ సైకలాజికల్.. మరొకటి కన్నడ హారర్
OTT Thriller: ఓటీటీలోకి ఇవాళ రెండు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చేశాయి. అదిరిపోయే సస్పెన్స్ తో సాగే ఈ మూవీస్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడతాయి. ఇందులో ఓ మలయాళ, మరో కన్నడ సినిమా ఉన్నాయి. ఇవి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT Thriller: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల జోష్ తో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కళకళలాడుతాయి. ఇవాళ కూడా చాలా సినిమాలే ఓటీటీ డెబ్యూ చేశాయి. ఇందులో ఈ రెండు థ్రిల్లర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో ఒకటి ‘ఫేసెస్’ కాగా.. మరొకటి ‘సీట్ ఎడ్జ్’.

ఫేసెస్ ఓటీటీ
మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ‘ఫేసెస్’. థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శుక్రవారం (మే 29) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఫేసెస్ మూవీ అందుబాటులోకి వచ్చేసింది.
తెలుగులోనూ
ఒరిజినల్ మలయాళ భాషలో తెరకెక్కిన ‘ఫేసెస్’ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగులోనూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఇదే
ఫేసెస్ మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. ఇందులో హన్నా రెజి కోషి, కాలేష్ రామానంద్, అర్జున్ గోపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నీలేష్ ఈకే దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉంది. ఫేసెస్ మూవీలో హీరోయిన్ నిత్యకు ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది.
నిత్య బాయ్ ప్రెండ్ మైఖెల్ కనిపించకుండా పోతాడు. అతణ్ని నిత్య వెతుకుతుంది. కానీ బయట చూసిన ప్రతి ఒక్కరి ముఖంలోనూ మైఖెల్ కనిపిస్తాడు. మరి నిత్యకు అలా ఎందుకు జరుగుతుంది? ఆమె నిజంగానే మైఖెల్ ను కనిపెట్టిందా? అన్నదే ఫేసెస్ మూవీ స్టోరీ.
సీట్ ఎడ్జ్ ఓటీటీ
ఈ రోజు ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సీట్ ఎడ్జ్’ కూడా వచ్చేసింది. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సిద్దు, రవిక్ష శెట్టి, రఘు తదితరులు నటించారు. ఈ హారర్ థ్రిల్లర్ కు చేతన్ శెట్టి డైరెక్టర్.
కథ ఏమిటంటే?
సీట్ ఎడ్జ్ మూవీ హారర్ థ్రిల్ తో పాటు కామెడీ కూడా అందిస్తుంది. దెయ్యాలు లాంటి పారానార్మాల్ విషయాలను లైవ్ స్ట్రీమింగ్ చేసే ఓ యూట్యూబర్ కథ ఇది. మరి ఆ యూట్యూబర్ కు నిజమైన దెయ్యాలు కనిపిస్తే ఏం జరిగింది? వాటి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? అన్నది సీట్ ఎడ్జ్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


