OTT Today: ఓటీటీ ప్రేక్షకులకు మరో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజుల్లోనే తమిళ చిత్రం 'ఆల్ పాస్' (All Pass) ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. మైదీన్ (మైదీన్ పక్కిర్ మైదీన్) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, రోజువారీ జీవితంలోని సవాళ్లు, కుటుంబ బంధాలను ఎంతో సహజంగా ఆవిష్కరించింది.

ఉత్తర చెన్నై నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా.. మూడు కుటుంబాల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోకుండా వచ్చిన డబ్బుతో మారిన సమీకరణాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది.
ఆల్ పాస్ మూవీ స్టోరీ ఏమిటంటే?
ఈ ఆల్ పాస్ మూవీ కథ అంతా ఉత్తర చెన్నైలోని 'సత్యనగర్' అనే బస్తీ చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వేర్వేరు నేపథ్యాలు ఉన్న మూడు కుటుంబాలు పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే ఇంట్లో కలిసి నివసించాలని నిర్ణయించుకుంటాయి.
విభిన్న స్వభావాలు ఉన్నప్పటికీ వారి మధ్య ఏర్పడిన బలమైన అనుబంధం, ఒకరికొకరు తోడుగా నిలిచే తీరు ప్రేక్షకులను కథలో మమేకం చేస్తాయి. అయితే అనుకోకుండా వారి జీవితాల్లోకి ఒక పెద్ద సంక్షోభం, దానితోపాటు భారీగా డబ్బు వచ్చి పడుతుంది.
ఆ డబ్బు వారి ఆత్మీయ బంధాలను ఎలా పరీక్షించింది? అంతిమంగా వారు ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నారనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
ఆల్ పాస్ మూవీ విశేషాలు
వన్ స్టెప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మోహన రంగనాథన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. మైదీన్ డైరెక్ట్ చేయగా.. జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ఇక దుష్యంత్ జయప్రకాష్, జయప్రకాష్, సెంథిల్ కుమారి, సుబ్రమణ్యం శివ, జనని గుణశీలన్, వినోదిని వైద్యనాథన్, ప్రసన్న బాలచందర్, శరత్ లోహితాశ్వ తదితరులు నటించారు.
ఆల్ పాస్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
'ఆల్ పాస్' చిత్రానికి డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పరిమిత బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, దర్శకుడు మైదీన్ ఎంచుకున్న పాయింట్, ఉత్తర చెన్నై జీవన విధానాన్ని రియలిస్టిక్‌గా చూపించిన తీరును విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}'ఆల్ పాస్' చిత్రానికి డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పరిమిత బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, దర్శకుడు మైదీన్ ఎంచుకున్న పాయింట్, ఉత్తర చెన్నై జీవన విధానాన్ని రియలిస్టిక్‌గా చూపించిన తీరును విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}జేమ్స్ వసంతన్ అందించిన మెలోడీ పాటలు, నేపథ్య సంగీతం ఈ ఫ్యామిలీ డ్రామాకు ప్రధాన బలంగా నిలిచాయి. నటులు జయప్రకాష్, సెంథిల్ కుమారి, జనని తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమా ఫస్టాఫ్ కామెడీ, ఎమోషన్స్‌తో వేగంగా సాగగా, సెకండాఫ్ లో కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ ఇచ్చే ఫీల్ గుడ్ ఎమోషన్ ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుంది. ఈ దీపావళి వీకెండ్ లో కుటుంబంతో కలిసి చూడటానికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.