క్లైమ్యాక్స్ మాకు నచ్చలేదు.. పంచాయత్ సీజన్ 4 చివరి ఎపిసోడ్‌కు పడిపోయిన రేటింగ్.. అభిమానులను హర్ట్ చేసిన మేకర్స్

పంచాయత్ సీజన్ 4 వచ్చేసింది. కానీ ఈ కొత్త సీజన్ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్, క్లైమ్యాక్స్ నిరాశ పరిచినట్లు ఐఎండీబీ రేటింగ్ చూస్తే తెలుస్తోంది. గత మూడు సీజన్లతో పోలిస్తే చివరి ఎపిసోడ్ కు వచ్చిన అతి తక్కువ రేటింగ్ ఇదే.

Published on: Jun 25, 2025, 11:14:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పంచాయత్ సీజన్ 4 వచ్చేసింది. కానీ, ఈసారి ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు చివరి ఎపిసోడ్ మాత్రం చాలా మందికి నచ్చలేదని ఐఎండీబీ రేటింగ్ చూస్తే స్పష్టమవుతోంది. గత మూడు సీజన్లలో చివరి ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.8 రేటింగ్ రాగా.. ఈసారి అంతకంటే కూడా దారుణమైన రేటింగ్ నమోదైంది.

క్లైమ్యాక్స్ మాకు నచ్చలేదు.. పంచాయత్ సీజన్ 4 చివరి ఎపిసోడ్‌కు పడిపోయిన రేటింగ్.. అభిమానులను హర్ట్ చేసిన మేకర్స్
క్లైమ్యాక్స్ మాకు నచ్చలేదు.. పంచాయత్ సీజన్ 4 చివరి ఎపిసోడ్‌కు పడిపోయిన రేటింగ్.. అభిమానులను హర్ట్ చేసిన మేకర్స్

పంచాయత్ 4.. నచ్చని క్లైమ్యాక్స్

పంచాయత్ కొత్త సీజన్ ఎప్పుడు వచ్చినా.. ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూ వస్తుంది. ప్రారంభం నుంచి ఎన్నో మరపురాని జ్ఞాపకాలు, ఆనందాన్ని అభిమానులకు అందించింది. కానీ సీజన్ 4 మాత్రం గతంలో మాదిరిగా లేదు. సీజన్ 3 నుంచే ఈ మార్పుకు సంకేతాలు కనిపించాయి. ఇప్పుడు సీజన్ 4 ఆ సందేహాలను నిజం చేసింది. పంచాయత్ సిరీస్ ఐదో సీజన్‌తో ముగుస్తుందని తెలుస్తున్నప్పటికీ, సీజన్ 4 ముగింపు మాత్రం చాలా మందిని నిరాశపరిచింది.

ఐఎండీబీ రేటింగ్ చూస్తే ఈ విషయం తెలుస్తోంది. పంచాయత్ 4 చివరి ఎపిసోడ్ కు 8.2 రేటింగ్ మాత్రమే నమోదైంది. సిరీస్ ప్రారంభం నుంచి గతంలో వచ్చిన మూడు సీజన్లలోని చివరి ఎపిసోడ్ రేటింగ్స్ కంటే కూడా ఇది తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.

గతంలో చివరి ఎపిసోడ్లు ఇలా..

పంచాయత్ మొదలైనప్పుడు, సీజన్ 1 ముగింపుకు 8.8 రేటింగ్ వచ్చింది. ఇది ప్రస్తుత ఎపిసోడ్‌ల రేటింగ్‌లకు చాలా దగ్గరగా ఉంటుంది. సీజన్ 4లోని కొన్ని ఎపిసోడ్‌లు కూడా ఇదే రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. పంచాయత్ సీజన్ 2తో ప్రేక్షకులు తీవ్రమైన మార్పును గుర్తించారు. ఆ సీజన్ ముగింపుకు 9.6తో అత్యధిక రేటింగ్ నమోదైంది. ఏ సీజన్లో లేని విధంగా రెండో సీజన్ క్లైమ్యాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. దీంతో దానికి అత్యుత్తమ రేటింగ్ నమోదైంది.

ఇక అంతంతమాత్రంగానే అనిపించిన సీజన్ 3 ముగింపు కూడా పర్ఫెక్ట్ 9 స్కోర్ చేసింది. ఆ సీజన్ చివరి ఎపిసోడ్లో ప్రధాన్ పై దాడి జరగడం చూడొచ్చు. కానీ సీజన్ 4 మాత్రం ప్రేక్షకులను చాలా వరకు నిరాశపరిచినట్లు రేటింగ్ చూస్తే తెలుస్తోంది. 8.2 రేటింగ్ పంచాయత్ సిరీస్ రేంజ్ కు చాలా తక్కువే అని చెప్పాలి. క్లైమ్యాక్స్ లో ఏం జరిగిందన్నది చెబితే ఈ కొత్త సీజన్ చూసిన మజా ఉండదు. అందుకే ఆ ట్విస్ట్ ఏంటన్నది మీరు సిరీస్ చూసే తెలుసుకోండి.

పంచాయత్ సీజన్ 5తో ముగుస్తుందా?

పంచాయత్ సీజన్ 4 ఒక ఊహించని మలుపుతో ముగిసింది. సిరీస్ అలా ముగియకూడదని అభిమానులంతా ఆశించారు. సచివ్ జీ (జితేంద్ర కుమార్) ప్రియురాలు రింకీ పాత్ర పోషించిన నటి సాన్విక కూడా పంచాయత్ సీజన్ 5 వర్క మొదలైందని చెప్పింది.

అయితే ఈ సీజన్ తోనే ఇక ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు ముగింపు పలకబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సీజన్ 4 ముగిసిన తీరును బట్టి కొత్త సీజన్ ఎలా ఉండనుందో అన్న ఆసక్తి మొదలైంది. అయితే చివరి సీజన్ మాత్రం అభిమానులు ఆశించినట్లుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ నాలుగో సీజన్ కు వచ్చిన మిక్స్‌‌డ్ రివ్యూలతో మేకర్స్ ఐదో సీజన్ ను ఎలా ముగిస్తారో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More