పంచాయత్ సీజన్ 4 రివ్యూ.. క్లైమ్యాక్స్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారు.. ఎన్నికల రచ్చలోనూ నవ్వించినా..

ఇండియా మెచ్చిన వెబ్ సిరీస్‌లలో ఒకటి పంచాయత్. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తాజాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో మేకర్స్ పెద్ద ట్విస్టే ఇచ్చినా.. డర్టీ పాలిటిక్స్ లో తొలి మూడు సీజన్ల నవ్వులు ఈ కొత్త సీజన్లో పెద్దగా కనిపించలేదు.

Jun 24, 2025, 18:01:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ మంగళవారం (జూన్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందు చెప్పినదాని కంటే ఒక వారం ముందే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ కొత్త సీజన్ ఎలా ఉంది? తొలి మూడు సీజన్లలాగే నవ్వించిందా? ఫులేరా ఎన్నికలు ఏమయ్యాయి? పంచాయత్ నాలుగో సీజన్ రివ్యూ ఇక్కడ చూడండి.

పంచాయత్ సీజన్ 4 రివ్యూ.. క్లైమ్యాక్స్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారు.. ఎన్నికల రచ్చలోనూ నవ్వించినా..
పంచాయత్ సీజన్ 4 రివ్యూ.. క్లైమ్యాక్స్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారు.. ఎన్నికల రచ్చలోనూ నవ్వించినా..

పంచాయత్ నాలుగో సీజన్ ఇలా..

పంచాయత్ పేరుతో 2019లో తొలిసారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. చందన్ కుమార్ కథ అందించగా.. దీపక్ కుమార్ మిశ్రా డైరెక్ట్ చేశాడు. మూడు సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరోసారి సచివ్ జీ అభిషేక్ త్రిపాఠీ (జితేంద్ర కుమార్), ప్రధాన్ జీ బ్రిజ్ భూషణ్ (రఘుబీర్ యాదవ్), ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్), ఆఫీస్ అసిస్టెంట్ వికాస్ (చందన్ రాయ్), ప్రధాన్ మంజు దేవి (నీనా గుప్తా), భూషణ్ (దుర్గేష్ కుమార్) తిరిగి వచ్చారు. మూడో సీజన్ ముగిసిన దగ్గర నుంచే ఈ నాలుగో సీజన్ మొదలైంది.

నాలుగో సీజన్.. డర్టీ పాలిటిక్స్

తొలి ఎపిసోడ్ మొత్తం అభిషేక్, భూషణ్ మధ్య రాజీ, కేసుల మాఫీ కోసం చేసే ప్రయత్నాలు చుట్టూ సాగుతుంది. రెండో ఎపిసోడ్ నుంచే అసలు స్టోరీ మొదలవుతుంది. ఫులేరా ఊళ్లో ఎన్నికల నగారా మోగుతుంది. దీంతో మంజు దేవి, క్రాంతి దేవి మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది.

అన్ని ఎన్నికల్లో ఉన్నట్లే ఫులేరాలోనూ డర్టీ పాలిటిక్స్ మొదలవుతాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాలుగో సీజన్ మొత్తం ఎన్నికల ప్రక్రియ చుట్టూ తిరిగింది. ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఫులేరాకు కొత్త ప్రధాన్ ఎవరన్నది ఈ సీజన్లో చూడొచ్చు.

పంచాయత్ కొత్త సీజన్ ఎలా ఉందంటే?

పంచాయత్ నాలుగో సీజన్ రాజకీయాల్లో పడి అసలు కథను పక్కన పెట్టిందనే చెప్పాలి. అసలు తొలి మూడు సీజన్లు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యాయంటే దానికి కారణం సున్నితమైన భావోద్వేగాలు, సాగుతూ హాయిగా నవ్విస్తూ సాగే కథనమే. కానీ నాలుగో సీజన్లో అవే మిస్సయ్యాయి.

ఎన్నికల హడావిడిలోనూ అక్కడక్కడా నవ్వించినా.. మొత్తంగా చూస్తే తొలి మూడు సీజన్లతో పోలిస్తే ఇదే అత్యంత బలహీనమైన సీజన్ అని చెప్పొచ్చు. ఎనిమిది ఎపిసోడ్లపాటు ఎన్నికల ప్రక్రియను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈ సిరీస్ లోని లీడ్ రోల్స్ నటన కోసం కొత్త సీజన్ చూడొచ్చు. మరోసారి అందరూ వారి వారి పాత్రల్లో జీవించేశారు.

ఇక క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఐదో సీజన్ పై ఆసక్తి రేపుతోంది. కొత్త సీజన్లో ఏం జరగనుంది? సచివ్ జీ అభిషేక్ ఫులేరాలోనే ఉంటాడా? లేక తన ఎంబీయే కోసం వెళ్లిపోతాడా? అభిషేక్, రింకి ప్రేమ ఎక్కడి వరకూ వెళ్తుంది? అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అయితే నాలుగో సీజన్ డల్లుగా సాగడంతో ఐదో సీజన్ పై గతంలో ఉన్న స్థాయి అంచనాలు ఉండకపోవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More