OTT Telugu: పెళ్లయ్యాక వదిలివెళ్లే భార్య.. రప్పించేందుకు భర్త తిప్పలు.. ఇవాళ ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. 20 రోజులకే
OTT Telugu: తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజైన 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ చిన్న పాయింట్ తో ఫుల్ లెంగ్త్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది.
OTT Telugu: ఓటీటీలో ప్రతి వారం తెలుగు సినిమాలు సందడి ఉంటుంది. ఈ వారం డిఫరెంట్ జోనర్ తెలుగు మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇవాళ తెలుగు కామెడీ మూవీ ‘పాపం ప్రతాప్’ ఓటీటీలో రిలీజైంది. గురువారం (మే 7) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

పాపం ప్రతాప్ ఓటీటీ
లేటెస్ట్ తెలుగు కామెడీ ఫిల్మ్ ‘పాపం ప్రతాప్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
20 రోజులకే
విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘పాపం ప్రతాప్’ సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న థియేటర్లో విడుదలైంది. ఈ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక బోల్తా కొట్టింది.
కామెడీ డ్రామా
పాపం ప్రతాప్ మూవీ కామెడీ డ్రామాగా థియేటర్లలో రిలీజైంది. ఇందులో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటించారు. ‘మసూద’, ‘పరేషాన్’ తదితర సినిమాలతో అలరించిన తిరువీర్ ఈ పాపం ప్రతాప్ మూవీలో తన స్టైల్లో కామెడీ పండించాడు. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేష్ డైరెక్టర్.
పాపం ప్రతాప్ స్టోరీ
లంక గ్రామంలో పురుగుల మందు వ్యాపారం చేసే వీరయ్య (అజయ్ ఘోష్) కొడుకు ప్రతాప్ (తిరువీర్). అతను చిన్నప్పటి నుంచీ తన క్లాస్‌మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ప్రేమిస్తాడు. బుజ్జమ్మను ప్రేమలో పడేస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.
పంచాయితీ
పెళ్లి తర్వాత ప్రతాప్, బుజ్జమ్మకు శోభనం జరుగుతుంది. మూడు రాత్రులు ముగుస్తాయి. అయితే ఆ వెంటనే ఊరి పెద్దలతో బుజ్జమ్మ పంచాయితీ పెట్టిస్తుంది. తన భర్త రాత్రి ఇబ్బంది పెడుతున్నాడని చెప్తుంది. కానీ అసలు సమస్య ఏంటో పూర్తిగా చెప్పదు. సమస్య ఏంటో తనే తెలుసుకుని, సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే తనను కాపురానికి తీసుకురావాలని భర్తకు చెప్పి బుజ్జమ్మ వెళ్లిపోతుంది. దాంతో ప్రతాప్‌పై ఊరందరిలో అనుమానం మొదలవుతుంది.
ఆ తర్వాత ఏమైంది? ప్రతాప్‌లో ఉన్న సమస్య ఏంటీ? ప్రతాప్ గురించి ఊరంతా ఏమనుకున్నారు? బుజ్జమ్మను ప్రతాప్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? బుజ్జమ్మ ప్రతాప్ ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే? ఈ సినిమా చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


