తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం డార్క్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌ మూవీ - ర‌న్‌టైమ్ గంట న‌ల‌భై ఐదు నిమిషాలే!

మ‌ల‌యాళం డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ట్ట‌ప‌క‌ల్ తెలుగులో ప‌ట్ట‌ప‌గ‌లు పేరుతో రిలీజైంది. సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో కృష్ణ శంక‌ర్‌, సుధి కొప్ప, జాన్ ఆంటోనీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Published on: Jul 15, 2025, 11:42:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ‌ల‌యాళం డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ట్ట‌ప‌క‌ల్ తెలుగులో రిలీజైంది. ప‌ట్ట‌ప‌గ‌లు పేరుతో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో కృష్ణ శంక‌ర్‌, సుధి కొప్ప, జాన్ ఆంటోనీ కీల‌క పాత్ర‌లు పోషించారు. సాజీర్‌ స‌దాఫ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప‌ట్ట‌ప‌గ‌లు ఓటీటీ
ప‌ట్ట‌ప‌గ‌లు ఓటీటీ

జూన్‌లో రిలీజ్‌...

గ‌త ఏడాది జూన్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమా ర‌న్ టైమ్ కేవ‌లం గంట‌న్న‌రే. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు సాజీర్ స‌దాఫ్ ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కామెడీ వ‌ర్క‌వుట్ అయినా క‌న్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ప‌ట్ట‌ప‌గ‌లు క‌థ ఇదే...

మినిస్ట‌ర్ కు చెందిన కొన్ని కీల‌క‌మైన డాక్యుమెంట్స్‌, వీడియోల‌ను కార్లోస్ అనే గ్యాంగ్‌స్ట‌ర్‌ దొంగ‌త‌నం చేస్తాడు. మినిస్ట‌ర్ తాలూకూ సీక్రెట్స్ అన్ని అందులో ఉంటాయి. నాలుగున్న‌ర కోట్ల డ‌బ్బు ఇస్తే ఆ ఆధారాల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని మినిస్ట‌ర్‌తో డీల్ కుద‌ర్చుకుంటాడు.

మ‌రోవైపు సుకు త‌న ల‌వ‌ర్ ప్రియ‌ను క‌ల‌వ‌డానికి బైక్‌పై వ‌స్తాన‌ని మాటిస్తాడు. త‌న ద‌గ్గ‌ర బైక్ లేక‌పోవ‌డంతో స్నేహితుడు వినోద్‌తో క‌లిసి ఓ బైక్ దొంగిలిస్తాడు. అనుకోకుండా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల్ల కార్లోస్ గ్యాంగ్‌తో పాటు మినిస్ట‌ర్ మ‌నుషులు సుకు, వినోద్ వెంట‌ప‌డ‌తారు. సుకు వెంట వాళ్లు ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి? మినిస్ట‌ర్‌ను కార్లోస్ టార్గెట్ ఎందుకు చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఐఎమ్‌డీబీలో...

ఐఎమ్డీబీలో ప‌ట్ట‌ప‌క‌ల్ మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు ప‌దికిగాను 2.7 రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ యాభై ల‌క్ష‌ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ప‌ట్ట‌ప‌గ‌లు సినిమాకు షాన్ ర‌హ‌మాన్ మ్యూజిక్ అందించాడు.

ప‌ట్ట‌ప‌గ‌లు సినిమా కంటే ముందు మలయాళంలో ప్రేమ‌మ్‌, నేర‌మ్‌, గోల్డ్, వాథిల్‌, తుంబాతో ప‌లు సినిమాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు కృష్ణ శంక‌ర్‌.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More