...
...
Next Story

హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హరి హర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నంకు కీలక పదవిని ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఇవాళ నిర్వహించిన హరి హర వీరమల్లు ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. .

Published on: Jul 21, 2025, 15:57:46 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. తాజాగా ఇవాళ (జూలై 21) హరి హర వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంట్రాక్షన్ కోసం

హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్
హరి హర వీరమల్లు నిర్మాతకు కీలక పదవి.. నగ్నంగా ఉన్నట్టుంది.. జీవితంలో ఇదే తొలిసారి.. పవన్ కల్యాణ్ కామెంట్స్

పవన్ కల్యాణ్‌కు మైక్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా యాంకర్ సుమకోరారు. మైక్ చేతిలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ "పోడియం లేకుండా మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్లు ఉంది పోడియం లేకపోయేసరికి. దయచేసి మీరందరు తీసుకురండి. ఇంట్రాక్షన్ కోసం. జీవితంలో మొదటిసారి ఇది. పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ, సినిమా పరంగా ఆలోచించలేదు" అని అన్నారు.

"ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్‌ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కరోనా ప్రభావం చూపించింది

"అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. నేను ఏఎం రత్నం గారిని దగ్గర నుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది" అని పవన్ కల్యాణ్ చెప్పారు.

నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారికి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను" అని ఏఎం రత్నంకు కీలక పదవి ప్రతిపాదించడంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు.

"థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా అనేది మా జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe