Peddi ticket price : ఇంకొన్ని రోజుల్లో ‘పెద్ది’.. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేనట్టేనా?

Peddi ticket price AP : ఇప్పుడు టాలీవుడ్​ మచ్​ అవైటెడ్ సినిమా పెద్ది. జూన్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణలో మాత్రం పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Published on: May 30, 2026, 10:36:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi movie ticket price Telangana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ భారీ సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటి కోసం పెద్ది మేకర్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించారు. అయితే వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. కానీ తెలంగాణలో మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుందని తెలుస్తోంది.

పెద్ది సినిమాలో రామ్​చరణ్​, జాన్వీ కపూర్..
పెద్ది సినిమాలో రామ్​చరణ్​, జాన్వీ కపూర్..

గత కొన్ని నెలలుగా టాలీవుడ్​లో పెద్ద సినిమా రాలేదు. ఫలితంగా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న పెద్దిపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు, షోల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి..

1. ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షోలు, భారీ ధరలు..

ఏపీ ప్రభుత్వం 'పెద్ది' చిత్ర మేకర్స్ అభ్యర్థనకు అంగీకరిస్తూ టికెట్ ధరల పెంపునకు, రోజుకు 5 ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది.

ప్రీమియర్ షోలు: జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక షోల టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు.

మొదటి వారం పెంపు: సినిమా విడుదలైన మొదటి వారం రోజులు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు.

2. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఉపసంహరణ..

తెలంగాణలోనూ ఇదే తరహా పెంపుదల కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే, టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, అత్యవసరంగా ఇలాంటి ఆర్డర్లు ఇస్తే గందరగోళం నెలకొంటుందని కోర్టు అభిప్రాయపడిందని సమాచారం.

కోర్టు తమకు అనుకూలంగా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేలా లేకపోవడంతో, చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే, రామ్​చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్​ రేట్లు తెలంగాణలో సాధారణంగానే ఉండే అవకాశం ఉంది.

దీనిపై ఇంకొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

రామ్​చరణ్ 'పెద్ది' సినిమా విశేషాలు..

కథాంశం: విజయనగరం నేపథ్యానికి చెందిన ఒక సాధారణ గ్రామీణ యువకుడు క్రికెట్, సాంప్రదాయ కుస్తీ, పరుగు పందెంలో రాణించి 'క్రాస్ ఓవర్ అథ్లెట్'గా ఎలా ఎదిగాడనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ప్రధాని మోదీతో చరణ్: ఇటీవల రామ్ చరణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ సినిమా గురించి ప్రస్తావించారు. "ఇది మన మట్టి కథ, గ్రామాలను సాధికారిత వైపు నడిపించే ఒక స్ఫూర్తిదాయకమైన కథ," అని చరణ్ పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం చరణ్ తీవ్రంగా శ్రమించడమే కాకుండా షూటింగ్ సమయంలో మణికట్టు, కంటి గాయాలకు గురయ్యారు.

పెద్ది నటీనటులు - సాంకేతిక నిపుణులు..

వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్ లతో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు (మీర్జాపూర్ ఫేమ్), బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

సంగీతం: ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం మరో హైలైట్. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More