రెండు కోట్ల కట్నం కోసం వెయిటింగ్.. పెళ్లి తిప్పలతో పొట్ట చెక్కలు.. ఓటీటీలోకి వచ్చిన కామెడీ మూవీ.. కడుపుబ్బా నవ్వేయండి

పెళ్లి కోసం పెళ్లి కాని ప్రసాద్ తిప్పలు.. రెండు కోట్ల కట్నం కోసం డిమాండ్.. కడుపుబ్బా నవ్వించే కామెడీ.. పొట్టచెక్కలు చేసే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కామెడీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చే మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. 

Published on: Jun 05, 2025 9:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్.. విభిన్నమైన జోనర్ సినిమాలు దూసుకొస్తూనే ఉన్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తెలుగు కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వచ్చేసింది ఈ మూవీ.

ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (x/etvwin)
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ (x/etvwin)

ఆ ఓటీటీలోకి

తెలుగు కామెడీ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టింది ఈ సినిమా. మల్లీశ్వరి సినిమాలోని వెంకటేశ్ క్యారెక్టర్ పేరుతో వచ్చిన ఈ పెళ్లి కాని ప్రసాద్ ఫిల్మ్ థియేటర్లలో ఆడియన్స్ నవ్వించింది. కమెడియన్ సప్తగిరి హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు.

రెండు నెలల తర్వాత

పెళ్లి కాని ప్రసాద్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కామెడీ సినిమా మార్చి 21న థియేటర్లకు వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ ను నవ్వించిన ఈ మూవీకి అనుకున్నంత కలెక్షన్లు మాత్రం రాలేదు. కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రాబట్టనట్లు తెలిసింది. కొడుకు పెళ్లి కట్నం కోసం డిమాండ్ చేసే తండ్రి.. వివాహం కోసం హీరో తిప్పలు.. ఇలాంటి ఫన్ ఎలిమెంట్స్ తో పూర్తి కామెడీ మూవీగా పెళ్లి కాని ప్రసాద్ తెరకెక్కింది.

అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో పెళ్లి కాని ప్రసాద్ మూవీ తెరకెక్కింది. సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటించింది. ఈ మూవీకి 5.4 ఐఎండీబీ రేటింగ్ ఇచ్చింది.

కథ ఏమిటంటే?

మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో 38 ఏళ్ల ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తుంటాడు. తండ్రి (మురళీధర్ గౌడ్) చెప్పిన పూర్వీకుల రెండు కోట్ల కట్నం చరిత్ర విని అంతకంటే తక్కువ కట్నం తీసుకోకూడదని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ప్రియ (ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది.

తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి ఫారెన్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది ప్రియ. అయితే, ప్రసాద్ గురించి తెలిసి అతన్ని ట్రాప్ చేసి ప్రియ పెళ్లి చేసుకుంటుంది. వివాహం తర్వాత ఫారెన్ వెళ్లకూడదని ప్రసాద్ నిర్ణయించుకుంటాడు. దీంతో ఇద్దరు గొడవపడతారు. ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్లకూడదని అనుకున్నాడు? దానికి గల కారణం ఏంటీ? పెళ్లి కాని ప్రసాద్ పెళ్లాడి ఎలాంటి కష్టాలు పడ్డాడు? వంటి విషయాలు తెలియాలంటే ఈ పెళ్లి కాని ప్రసాద్‌ను చూడాల్సిందే.