పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు పేరుతో పక్కదారి పట్టించారు.. పర్సంటేజిపై ఆర్ నారాయణ మూర్తి కామెంట్స్.. దుర్మార్గం అంటూ!

పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరి హర వీరమల్లు. అయితే, ఇటీవల సినీ ఇండస్ట్రీలో పర్సెంటేజీ, థియేటర్ల బంద్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి పర్సంటేజి అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరిహర వీరమల్లు పేరుతో పక్కదారి పట్టిచారని అన్నారు.

Published on: Jun 1, 2025, 06:45:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల టాలీవుడ్‌లో థియేటర్ల బంద్, పర్సెంటేజీ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇదివరకే అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలు, పర్సంటేజీపై మీడియాతో ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడారు.

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు పేరుతో పక్కదారి పట్టించారు.. పర్సంటేజిపై ఆర్ నారాయణ మూర్తి కామెంట్స్.. దుర్మార్గం అంటూ!
పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు పేరుతో పక్కదారి పట్టించారు.. పర్సంటేజిపై ఆర్ నారాయణ మూర్తి కామెంట్స్.. దుర్మార్గం అంటూ!

పక్కదారి పట్టించారు

ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదని నారాయణ మూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తీరని విఘాతం

"ఇటీవల సినీ పరిశ్రమలో పర్సంటేజి విధానం కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్‌లో చర్చల జరుగుతున్నాయి. ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినీ పరిశ్రమలో పర్సంటేజి సిస్టమ్ వస్తుందా అని ఎదురుచూస్తున్ దశలో.. నా లాంటి సగటు నిర్మాతలందరికి తీరని విఘాతం జరిగింది" అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

చాలా దుర్మార్గం

"పర్సంటేజి ఇవ్వకపోతే హరి హర వీరమల్లు అనే సినిమాను ఆపడం కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం చాలా దుర్మార్గం. అదంతా ఉత్తదే. అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్ర దారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడటం కరెక్ట్ కాదు" అని నారాయణ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

బంద్ ప్రకటన చెప్పలేదు

"ఎందుకంటే మిత్రులారా.. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమ పాలన సంస్థలు. ఆ రెండు సంస్థలు ఎప్పుడు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పలేదు. డిస్కన్షన్ ఆన్ గోయింగ్ అని చెప్పారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం" అని నారాయణ మూర్తి తెలిపారు.

సమస్య మీద పోరాడుతున్నాం

"ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం మూడు వారాల ముందుగా తెలియజేయాలి. ఒక సమస్య మీద మేం పోరాడుతున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి మేం బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియజేయాలనేది నిబంధన" అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

3 వారాల ముందు చెప్పాలి

"మూడు వారాల ముందు తెలియజేస్తే.. విడుదల తేది ప్రకటించుకున్నవాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జూన్ 1న బంద్ ప్రకటిస్తే ఒకవేళ.. జూన్ 12 అంటే రెండు వారాలు కూడా కావు కదా. ఏ రకంగా హరి హర వీరమల్లుకు బంద్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు" అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More