Podarillu October 8 Episode: పొదరిల్లు.. బృందావనంలోకి జమున.. తరమేసిన రెండో భర్త.. విక్కీకి హ్యాండిచ్చిన లక్కీ..కేశవ షాక్
Podarillu Serial October 8th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 8 ఎపిసోడ్ లో కన్నా తల్లి జమునను ఇంటికి తీసుకొస్తారు మహా, చక్రి. ఆమెను చూసి నారాయణ, కన్నా షాకవుతారు. అటు తన బాస్ విక్కీకి లక్కీ హ్యాండిస్తుంది.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఓవైపు కేశవ, శైలు.. విక్కీ, లక్కీ లవ్ ట్రాక్ లతోపాటు కన్నా తల్లిని చక్రి కనిపెట్టి తీసుకొచ్చే సీన్ కూడా ఇందులో చూడొచ్చు. బృందావనంలోకి జమున అడుగు పెట్టే సీన్ ఈరోజు హైలైట్ అని చెప్పొచ్చు.

కేశవ షాపు కోసం ఇంట్లో వాళ్లందరి సాయం
కేశవకు అతని షాపు స్థలాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మహా చెప్పే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. ఆ స్థలం కొంటే కేశవకు రెంట్ తప్పుతుంది.. తన వంతు సాయం చేస్తానని మాధవ అంటాడు. తాను కూడా తనకు తోచింది ఇస్తానని మహా చెబుతుంది.
అటు ఆమె దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అనుకొని చక్రి కూడా తానూ ఓ లక్ష, లక్షన్నర ఇస్తానంటాడు. ఏ ఆంటీని అడిగి ఇస్తారు అని మహా అనడంతో అతడు షాకవుతాడు. అటు కన్నా కూడా తన బర్త్ డేకు అన్న మాధవ ఇచ్చిన రింగు అమ్మి డబ్బు ఇస్తానంటాడు. కానీ మిగతా వాళ్లు వద్దంటారు.
కేశవను ఎగతాళి చేసిన శైలు
అటు షాపులో ఉన్న కేశవ శైలుని అర్జెంటుగా రమ్మంటాడు. ఆమె పెళ్లి కోసమేనేమో అనుకొని హడావిడిగా వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఈ షాపును అన్న కొంటున్నాడని అందులో పని చేసే కుర్రాడు శైలుతో చెబుతాడు. ఇది చెప్పడానికే ఇంత అర్జెంటుగా రమ్మన్నావా.. ఇదేమైనా మైసూర్ ప్యాలెసా.. వైట్ హౌసా అని శైలు తీసి పారేస్తుంది.
ఈ స్థలం కొంటే అన్న బాగా డబ్బులు సంపాదిస్తాడని అంటున్నా కూడా శైలు పట్టించుకోదు. ఎందుకలా మాట్లాడుతున్నావని కేశవ అడిగితే.. అసలు నువ్వీ పని చేయడమే నాకు ఇష్టం లేదు.. ఏ కారు షోరూమ్ లోనూ చేరమని చెప్పినా వినడం లేదు అంటూ శైలు అలిగి వెళ్లిపోతుంది. దీంతో కేశవ షాకవుతాడు.
ప్రాజెక్టుపై లక్కీని ఆరా తీసిన విక్కీ.. ఇబ్బందిగా ఫీలైన లక్కీ
మరోవైపు ఆఫీసులో లక్కీకి ఇచ్చిన ప్రాజెక్టుపై విక్కీ ఆరా తీస్తాడు. అది ఎంత వరకూ వచ్చిందో వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ప్రాజెక్టులో ఏవో ఇంప్రొవైజేషన్స్ చేశావన్నావు కదా.. చూపించు అంటాడు. ఆ తర్వాత ఆమె ప్రాజెక్టు గురించి చెబుతుంటే విక్కీ మాత్రం ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. పక్కనే ఉన్న కొలీగ్ దివ్య విక్కీని చూస్తుంది. విక్కీ వెళ్లిపోయిన తర్వాత లక్కీని మళ్లీ ఆట పట్టిస్తుంది. దీంతో మహా కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంది.
మహాకు ఫ్రెండ్ రేఖ ఫోన్.. కేశవ కోసం కొత్త పని ఒప్పుకొని..
అప్పుడే మహాకు ఆమె ఫ్రెండ్ రేఖ ఫోన్ చేస్తుంది. తన ఫ్రెండ్ ఒకరికి ఇంటీరియర్ డిజైన్ చేసి పెట్టాలని, తాను బయట ఉండటంతో తనకు కుదరడం లేదని చెబుతుంది. కానీ ఆఫీసులో పెద్ద ప్రాజెక్టు పనిలో ఉన్నానని, కుదరదని మహా చెబుతుంది. ప్లీజే.. వాళ్లు లక్ష ఇస్తారంట అని రేఖ చెబుతుంది. అయినా వద్దని చెప్పిన మహా.. తర్వాత కేశవ షాపు గురించి ఆలోచిస్తుంది. సరే అని చెబుతుంది. ఆ లక్ష కేశవ షాపు కోసం ఇవ్వొచ్చిన అనుకుంటుంది.
కన్నా తల్లి జమునని బైకుతో ఢీకొట్టిన చక్రి
అటు కన్నా తల్లి జమున కోసం చక్రి వెతుకుతూనే ఉంటాడు. కానీ ఎవరూ ఆమె జాడ చెప్పరు. బైకు వెళ్తూ ఎటో చూస్తున్న చక్రి.. ఎదురుగా వస్తున్న జమునను చూడక ఢీకొట్టేస్తాడు. దీంతో ఆమె కిందపడిపోతుంది. వెంటనే చక్రి ఆమెను పైకి లేపి సారీ చెబుతాడు. ఫర్వాలేదంటూ ఆమె వెళ్లిపోతుంది. తర్వాత సడెన్ గా ఆమె కన్నా వాళ్ల అమ్మే అని గుర్తు పడతాడు. ఇంతలో ఆమె మరో గల్లీలోకి వెళ్లిపోవడంతో ఆమె కోసం చక్రి మళ్లీ వెతకడం మొదలు పెడతాడు.
రెండో భర్తతో జమున ఫైట్.. చూసేసిన చక్రి
అదే సమయంలో జమున రెండో భర్త ఇంట్లో రచ్చ చేస్తాడు. అప్పులోళ్లు వచ్చి ఇంట్లో సామానంతా బయట పడేస్తారు. అతడు చేసిన పని చూసి జమున షాకవుతుంది. ఇంకా ఎన్నాళ్లిలా అప్పులు చేస్తూ తిరుగుతావు అని తిడుతుంది. అయినా అతడు ఏమీ పట్టించుకోకుండా జమున తాను పని చేసి ఇళ్ల నుంచి తెచ్చి ఫుడ్ తింటూ ఉంటాడు.
రేపు అప్పులోళ్లు మళ్లీ వస్తారని, ఆలోపు ఇద్దరం చెరో చోటుకి ఎక్కడికైనా వెళ్లిపోదామని అంటాడు. తనకు బార్లో వెయిటర్ ఇల్లు ఉందని, నువ్వు మరో ప్లేస్ చూసుకోవాలని జమునకు చెబుతాడు. దీంతో ఆమెకు ఎక్కడికెళ్లాలో అర్థం కాక భర్తను తిడుతుంది. అప్పుడే చక్రి దూరం నుంచి వాళ్లను చూస్తాడు. ఆమెనే కన్నా తల్లి అని తెలుసుకుంటాడు.
మహా, కేశవ, మాధవకు ఫోన్ చేసి చెప్పిన చక్రి
ఆమె కన్నా తల్లే అని డిసైడైన చక్రి వెంటనే ఈ విషయం మహాకు ఫోన్ చేసి చెబుతాడు. ఆఫీసులో ఉన్న ఆమె ఎగిరి గంతేస్తుంది. సాయంత్రం ఆఫీసు కాగానే ఇద్దరం కలిసి వెళ్లి కలుద్దామని చక్రికి చెబుతుంది. అతడు సరే అంటాడు. ఆ తర్వాత అదే విషయం కేశవ, మాధవకు కూడా చక్రి ఫోన్ చేసి చెబుతాడు. ఆమెను ఇంటికి తీసుకొచ్చే వరకు కన్నాకు ఈ విషయం ఎవరూ చెప్పొద్దని అనుకుంటారు.
జమున దగ్గరికి చక్రి, మహా
సాయంత్రం ఆఫీసు కాగానే మహా ఆఫీసుకు చక్రి వెళ్తాడు. అటు లక్కీని రెస్టారెంట్ కు తీసుకెళ్దామని విక్కీ ప్లాన్ చేస్తాడు. అదే విషయం ఆమెతో చెబితే తనకు అర్జెంట్ పని ఉందని అంటుంది. ఇంతలో చక్రి ఫోన్ చేయడంతో హడావిడిగా వెళ్లిపోతుంది. బయటకు వచ్చి చూసిన విక్కీకి షాకవుతాడు. లక్కీని చక్రితో చూస్తాడు. ఆ తర్వాత మహా, చక్రి కలిసి జమున దగ్గరికి వెళ్తారు. అప్పటికే రెండో భర్త ఇంటికి తాళం వేసి ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతాడు.
చక్రి, మహా వెళ్లి ఆమెను పరిచయం చేసుకుంటారు. తన పేరు, మాధవ పేరు చెప్పి ఏమైనా గుర్తొస్తుందా అని అడుగుతారు. తర్వాత కన్నా ఫొటో కూడా చూపిస్తాడు. ఆమె మాత్రం తన రెండో భర్త అప్పులోళ్లేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత జమునకు అసలు విషయం చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఆమెను చూడగానే నారాయణ, కన్నా షాకవుతారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


