Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!

Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ పాట చాలా ఎనర్జిటిక్‍గా ఉంది. మాస్ స్టెప్‍లతో అదరగొట్టారు ధనుష్. ఈ సాంగ్ రిలిక్స్ ఇక్కడ చూడండి.

Published on: Apr 20, 2025 10:33 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంపై చాలా ఆసక్తి ఉంది. తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు అంచనాలను మరింత పెంచేశాయి. ఈ క్రమంలో కుబేర సినిమా నుంచి నేడు (ఏప్రిల్ 20) తొలిసారి వచ్చేసింది. ఈ పాట మాస్ బీట్‍తో అదిరిపోయింది.

Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి అదిరిపోయేలా ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!
Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి అదిరిపోయేలా ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!

ధనుష్ గాత్రంతో.. అదిరే స్టెప్‍లతో..

కుబేర చిత్రం నుంచి పోయిరా ‘మామ’ అంటూ తొలి పాట వచ్చింది. లిరికల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. శవయాత్ర బ్యాక్‍డ్రాప్‍లో ఈ పాట ఉంది. కానీ మంచి ఎనర్జిటిక్‍గా, మాస్ బీట్‍తో ఈ పాట సాగింది. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. ఈ సాంగ్‍ను ధనుష్ ఆలపించారు. మాస్ స్టెప్‍లతో అదరగొట్టారు. ఈ పాటకు భాస్కరభట్ల రిలిక్స్ అందించారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

‘పోయిరా మామ’ లిరిక్స్ ఇవే

హే వన్‍డే హీరో నువ్వే ఫ్రెండు

నీకోసమే ఈ డప్పుల్ సౌండు..

అసల్ తగ్గక్ అట్లనే ఉండు

మొక్కుతారు కాళ్లూ రెండూ..

నిన్నే చూస్తున్నాది

ఊరు మొత్తం దేవుడిలాగా..

వన్‍వేలో నా నువ్వెళ్లినా

అపరు నిన్ను అందరిలాగా..

రథం మీదే నువ్వే అలాగా

దూసుకెళ్తా ఉంటే అబ్బో యమాగా..

సీఎం, పీఎం ఎదురే వచ్చినా

నువ్వు సలాం కొట్టే పనే లేదుగా..

ముందరి లాగా అంత ఈజీగా

నిన్నే కలుసుకోలేరుగా..

నీతో ఫొటో దిగాలన్నా

చచ్చేంత పనవుతుంది గా..

పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అరే రాజాలాగా దర్జాగా పోయిరా మామ..

పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామా

అరే రాజాలాగా దర్జాగా పోయిరా మావా..

చూస్తూ.. చూస్తూనే.. మారిందే

నీ రేంజ్ ఈరోజున..

నిన్నే అందుకోవాలి అనుకుంటే

సరిపోదే ఏ నిచ్చెన..

సొమ్ములైన సోకులైన

తలొంచవా నీ ముందర..

నిన్నే కొనే ఐసా పైసా

ఈ లోకంలో యాడుందిరా..

నిన్నే తిట్టి గల్లా పట్టి

సతాయించే సారే లేడురా.. ఓ

పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అహా రాజాలాగా దర్జాగా పోయిరా మామ..

నీతోటి మాటాడి గెలిచేటి

దమ్మే ఈడ లేదెవడికి..

స్వర్గం అరే నీ జేబులో ఉంది

బాధే లేదు ఏనాటికీ..

ఎయిరోప్లేను.. రాకెట్టు

నీ కాళ్ల కింద ఎగరాల్సిందే..

ఎంతోడైనా తలే ఎత్తి.. అలా నిన్ను చూడాల్సిందే..

తలరాతల్ని చెరిపి మళ్లా

రాసేసుకో నీకే నచ్చిందే.. ఓ..ఓ

పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

మహారాజాలాగా దర్జాగా పోయిరా మామ..

పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అరే రాజా లాగా.. దర్జాగా పోయిరా మామ

చావును కూడా సెలెబ్రేషన్‍లా చేసుకునేలా ఈ పాట సాగింది. వేదాంతం కూడా కనిపిస్తోంది. తన ఫ్రెండ్‍కు తుది వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఈ పాట సాగింది. చాలా హుషారుగా ఈ సాంగ్ ఉంది.

ధనుష్, నాగార్జునతో కుబేర మూవీలో పాటు రష్మిక మందన్నా కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎస్‍ఎస్‍పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.

News/Entertainment/Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!
News/Entertainment/Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!