ప్రభాస్‌ రేర్ ఇంటర్వ్యూ.. హోంబలే ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు కాదు చాలానే ఉన్నాయట.. అతడు ఏం చెప్పాడో చూడండి

ప్రభాస్ ఓ రేర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీడియాతో పెద్దగా మాట్లాడని అతడు.. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో హోంబలే ఫిల్మ్స్ తో తాను చేయబోయే ప్రాజెక్టులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ రిపోర్టర్ కు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Jul 16, 2025, 17:38:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రధానంగా హోంబలే ఫిల్మ్స్ తో తాను చేయబోయే ప్రాజెక్టులపై స్పందించాడు. ఇప్పటికే ఈ టాప్ ప్రొడక్షన్ కంపెనీతో సలార్ మూవీ చేసిన అతడు.. భవిష్యత్తులో మూడు సినిమాలు చేయబోతున్నట్లు గతంలోనే తేలగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే అని ప్రభాస్ చెప్పడం విశేషం.

ప్రభాస్‌ రేర్ ఇంటర్వ్యూ.. హోంబలే ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు కాదు చాలానే ఉన్నాయట.. అతడు ఏం చెప్పాడో చూడండి
ప్రభాస్‌ రేర్ ఇంటర్వ్యూ.. హోంబలే ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు కాదు చాలానే ఉన్నాయట.. అతడు ఏం చెప్పాడో చూడండి

ప్రభాస్ ఏమన్నాడంటే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. హోంబలే ఫిల్మ్స్‌తో తన మూడు చిత్రాల ఒప్పందం, ఆ సంస్థతో తన సన్నిహిత సంబంధం గురించి హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడాడు. 2023లో విడుదలైన యాక్షన్ ఎపిక్ ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ తర్వాత హోంబలే ఫిల్మ్స్‌తో మరిన్ని ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించాడు.

ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరగండూర్‌తో తన సంబంధం గురించి మాట్లాడుతూ.. “విజయ్ కిరగండూర్‌లోని సినిమా పట్ల అభిరుచి, అందరినీ చూసుకోవడం నన్ను ఆకర్షించాయి. అతడు చాలా సింపుల్. అనుకువతో ఉంటాడు. మేము కుటుంబంలా మారాము. విజయ్ తో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఫీలవుతాను. సలార్ తో మొదలైంది. మరెన్నో మూవీస్ మేము కలిసి చేయబోతున్నాం” అని అన్నాడు. ఈ సన్నిహిత సంబంధమే మూడు సినిమాల ఒప్పందానికి దారితీసిందని, సినిమా పట్ల వారి ప్రేమ ఈ సహకారానికి బాటలు వేసిందని ప్రభాస్ తెలిపాడు.

సలార్ 2తో ప్రారంభం

2024 నవంబర్‌లో హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన మూడు చిత్రాల ఒప్పందంలో ‘సలార్: పార్ట్ 2’ ఒకటని ప్రభాస్ ధృవీకరించాడు. ఈ ఒప్పందం తమ సినిమా పట్ల అభిరుచి, పెద్ద ఎత్తున సినిమాలను నిర్మించే లక్ష్యాన్ని సూచిస్తుందని తెలిపాడు. సలార్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచింది.

ప్రభాస్ కు మూడు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన మెగా హిట్ ఇది. ఇప్పుడు సలార్ 2పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతోపాటు మరో రెండు సినిమాలు కూడా హోంబలే ఫిల్మ్స్ తో చేయబోతుండటంతో వీళ్ల కాంబినేషన్ లో రానున్న మూవీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ తన రాబోయే సినిమా గురించి కూడా కొన్ని హింట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అతను మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ ‘ది రాజాసాబ్’లో నటిస్తున్నాడు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ కోసం లీన్ లుక్‌లో మేకోవర్ కావడం విశేషం.

ఈ సినిమా షూటింగ్ 2025 చివర్లో ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాల ద్వారా తన అభిమానులకు ఓ కొత్త అనుభూతిని తాను ఇవ్వాలని భావించినట్లు ప్రభాస్ చెప్పాడు. ఇటీవల విష్ణు మంచు ‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించాడు. ఇది ప్రేక్షకులను ఆకర్షించింది. సాధారణంగా ఇంటర్వ్యూల్లో ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడు. ఈ ఇంటర్వ్యూలోనూ అతడు అదే విషయం మరోసారి చెప్పాడు. తాను ఇంటర్వ్యూలలో అంత గొప్పగా మాట్లాడలేనని, తన సినిమాలు చూడటానికి అభిమానులు వస్తే చాలని, వాళ్లు ఆదరిస్తే అదే గొప్ప విజయమని ప్రభాస్ అన్నాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More