ప్రభాస్ మేనియా.. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ది రాజాసాబ్ కలెక్షన్ల మోత.. ఫస్ట్ డే 100 కోట్లకు పైగా.. కొత్త రికార్డు!
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' చిత్రం అదరగొట్టింది. మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల దుమ్ము రేపింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఓ రికార్డు కూడా ఖాతాలో వేసుకుంది.
ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, మిక్స్ డ్ టాక్ వినిపించినప్పటికీ ది రాజా సాబ్ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ హారర్-కామెడీ చిత్రం మొదటి రోజు (గురువారం ప్రీవ్యూలతో సహా) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

రాజా సాబ్ కలెక్షన్లు
హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాజా సాబ్ ఫస్ట్ డే అదరగొట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
"కింగ్ సైజ్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ తో ప్రతి కోటలో ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది ది రాజా సాబ్. ఒక హారర్ ఫాంటసీ చిత్రానికి ఇదే అతిపెద్ద ప్రారంభం" ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎక్స్ లో పేర్కొంది.
కొత్త రికార్డు
రాజా సాబ్ మేకర్స్ చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ మూవీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హారర్ ఫాంటసీ సినిమాగా నిలిచింది. మేకర్స్ ప్రకారం తొలి రోజు రూ.112 కోట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ కంటే రాజా సాబ్ ఫస్ట్ డే తక్కువ కలెక్షన్లు రాబట్టింది. 2024లో విడుదలైన ఆ చిత్రం మొదటి రోజు (గురువారం) రూ.191 కోట్లు వసూలు చేసింది.
ది రాజా సాబ్ గురించి
మారుతి దర్శకత్వం వహించిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన 'ది రాజా సాబ్' లో ప్రభాస్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహబ్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


