ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి బిగ్ అప్‌డేట్.. థియేట్రికల్ రిలీజ్ ఆ రోజే.. టీజర్ డేట్ కూడా రివీల్.. స్పెషల్ పోస్టర్
ప్రభాస్ ఫ్యాన్స్ కు రాజాసాబ్ టీమ్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్ని రోజులు అప్ డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ ఏ డేట్ కు వస్తుందో కూడా చెప్పేశారు.
చాలా కాలం నుంచి ఒక్క అప్ డేట్ లేక విసిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. ఈ పాన్ ఇండియా స్టార్ లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఒకటి కాదు రెండు వార్తలతో అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. రాజాసాబ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ వచ్చే తేదీని కూడా ప్రకటించేశారు మేకర్స్. మంగళవారం (జూన్ 3) స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

రాజాసాబ్ ఆ రోజే
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ థియేటర్లకు ఈ ఏడాది డిసెంబర్ 5న రాబోతోంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందుకు, బిగ్ స్క్రీన్ మీద మరోసారి ప్రతాపం చూపించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ రోజు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ 5నరిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్ లో మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాలిపోతున్న డబ్బు కట్టల పై నుంచి అగ్నికి ఆహుతవుతున్న ఓ ఎర్రని వస్త్రాన్ని లాగుతున్న ప్రభాస్ ఇంటెన్సివ్ గా కనిపించారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
టీజర్ ఎప్పుడంటే?
ది రాజాసాబ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన టీమ్.. అంతకంటే ముందు ఫ్యాన్స్ కు మరో ట్రీట్ కూడా ఇస్తామని పేర్కొంది. ఈ మూవీటీజర్ ను జూన్ 16న ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ‘‘రెబల్ వైబ్ తో రాజా. థియేటర్లలో అత్యంత ఎంటర్ టైనింగ్ యుఫోరియాను అందించేందుకు సిద్దమైంది. ప్రంపచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అంతకంటే ముందు జూన్ 16న ఉదయం 10.52 గంటలకు టీజర్ ఎక్స్ ప్లోజ్ అవుతుంది’’ అని సోషల్ మీడియాలో మేకర్స్ అనౌన్స్ చేశారు.
హారర్ థ్రిల్లర్
ప్రభాస్ తొలిసారి హారర్థ్రిల్లర్ లో కనిపించబోతున్నారు. ది రాజాసాబ్ మూవీని రొమాంటికి కామెడీ హారర్ థ్రిల్లర్ గా తన మార్క్ స్టైల్లో డైరెక్టర్ మారుతి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ యాక్ట్ చేస్తున్నారు. 2024 జనవరిలో ఈ మూవీని లాంఛ్ చేశారు.
నిజానికి రాజాసాబ్ మూవీని మొదట ఈ ఏడాది ఏప్రిల్ 10కే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ ఇప్పుడు డిసెంబర్ 5కు మారింది. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. సుమారు రూ.350 కోట్లను ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



