భయపెడుతూ యాక్షన్ థ్రిల్‌ను పంచేలా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్- వేటాడే వింత జీవినే వెంటాడితే- తెలుగులోనూ రిలీజ్

భయపెడుతూ యాక్షన్‌ను ఎంజాయ్ చేయాలంటే తమ ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్ సినిమాను చూడమంటున్నారు మేకర్స్. ప్రెడేటర్స్ సిరీస్‌లో వస్తున్న సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్. నవంబర్ 7న వరల్డ్ వైడ్‌గా తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ్రాంఛైజీపై లుక్కేద్దాం.

Nov 3, 2025, 11:01:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సైన్స్‌ ఫిక్షన్‌ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన ‘ప్రిడేటర్’ మూవీ సిరీస్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.

భయపెడుతూ యాక్షన్ థ్రిల్‌ను పంచేలా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్- వేటాడే వింత జీవినే వెంటాడితే- తెలుగులోనూ రిలీజ్
భయపెడుతూ యాక్షన్ థ్రిల్‌ను పంచేలా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్- వేటాడే వింత జీవినే వెంటాడితే- తెలుగులోనూ రిలీజ్

నవంబర్‌ 7న

ఇప్పుడు అదే సిరీస్‌కి కొత్త రూపాన్ని ఇస్తూ “ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” సినిమా రానుంది. నవంబర్‌ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడు అందరిని వేటాడే ప్రిడేటర్ ఈ సారి వలలో చిక్కుకుంటాడు.

అతన్ని ఎవరు బయట పడేశారు, ఎవరు కాపాడారు, ప్రెడేటర్‌తో పాటు తమను వెంటాడుతున్న వారిని వేటాడిన వ్యక్తి ఎవరు అనే అంశాలతో మరింత థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్‌ను తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

1987లో ప్రారంభం

హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి సినిమానే “ప్రిడేటర్”. అమెజాన్‌ అడవుల్లో కమాండోలు ఎదుర్కొన్న కంటికి కనిపించని భయానక మృగం కథగా ప్రెడేటర్ ప్రేక్షకులను కుదిపేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మరిన్ని మూవీస్ వచ్చేశాయి.

1990లో ప్రిడేటర్ 2- కాంక్రీట్ జంగిల్

ఈసారి లాస్‌ఏంజెల్స్‌ నగరాన్ని వేట స్థలంగా మార్చుకున్న యౌట్జా జీవి గ్యాంగ్‌స్టర్లను, పోలీసులను లక్ష్యంగా చేసుకుంది. మానవ చరిత్రలో ఈ జీవుల ఉనికి ఎంతకాలంగా ఉందో ఈ చిత్రంలో చూపిస్తారు.

2010లో ప్రిడేటర్స్– గేమ్ ప్రిజర్వ్ అండ్ బియాండ్ ప్రెడేటర్స్

ఈ భాగంలో మానవ యోధులను ప్రెడేటర్ల స్వగ్రహానికి తీసుకెళ్లి బంధిస్తారు. అక్కడ వారు సూపర్‌ ప్రెడేటర్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కథ యౌట్జా జాతి అంతర్గత విభేదాలను కూడా చూపించింది.

2022లో ఎ రిటర్న్ టు రూట్స్ ప్రే

1719లో అమెరికాలోని కమాంచీ తెగకు చెందిన యువతి నారు కథతో తెరకెక్కిన సినిమా “ప్రే”. ఇది ప్రెడేటర్‌ సిరీస్‌కు కొత్త ఊపును తెచ్చింది. కొత్త కాలం, కొత్త దృష్టికోణంతో వేటను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, దీనిని ప్రెడేటర్ మూవీకి ముందు ప్రీక్వెల్‌గా చెప్పారు మేకర్స్.

2025లో ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న కొత్త సినిమానే ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్. డాన్‌ ట్రాచ్‌టెన్‌బర్గ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరింత థ్రిల్ పంచనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈసారి కథ యౌట్జా యువ ప్రెడేటర్‌ “డెక్” చుట్టూ తిరుగుతుంది.

డెక్‌ ఒక ప్రమాదకరమైన గ్రహంలో ఆండ్రాయిడ్‌ యోధురాలు “థియా”తో కలిసి జీవన యుద్ధం సాగించాల్సి వస్తుంది. ఇది మొదటిసారిగా ప్రెడేటర్‌ దృష్టిలో చెప్పబడుతున్న కథ. యౌట్జా జాతి సంస్కృతి, విలువలు, నైతికత, బలహీనతల్ని లోతుగా చూపించబోతున్న ఈ చిత్రం.

కొత్త మలుపు

ఈ సినిమా ఈ ఫ్రాంచైజ్‌కు ఒక కొత్త మలుపు ఇవ్వనుందని మేకర్స్ ఆశిస్తున్నారు. భయపెడుతూ యాక్షన్ థ్రిల్ పంచే సినిమాను చూడాలనుకుంటే ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్‌ను చూడమని చెబుతున్నారు. కాగా, ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More