24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు.. ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో బహుభాషా సిరీస్!

జీ తెలుగు సరికొత్త బ్రాండ్ ఫిల్మ్‌ను అందిస్తోంది. ఏడు విభిన్నమైన సాంస్కృతిక కథలతో బహుభాషా సిరీస్‌ను తెరకెక్కించింది. 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జీ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ వేదికలలో ఒకేసారి ఈ బ్రాండ్ ప్రసారమైంది.

Published on: Jun 8, 2025, 15:43:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్‌లో​ జీ తెలుగు ఒకటి. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.

24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు..  ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో బహుభాషా సిరీస్!
24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు.. ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో బహుభాషా సిరీస్!

జీ తెలుగు బ్రాండ్ ఫిల్మ్

‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్‌​లో భాగంగా జీ తెలుగు ఛానల్​ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంగమంగా ఉండనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగు వారి లోగిలిలో జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించారు.

వైభవంగా జరిగిన పెళ్లి

బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగు వారి హృదయాలను హత్తుకుంటోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి వివాహానికి ముందు అనివార్య కారణాలతో సైనికుడైన తండ్రి విధుల్లో చేరవలసి వస్తుంది.

ఆ వేడుకకు తండ్రి దూరంగా ఉన్నాడనే లోటు తెలియకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అంతా ఒక్కటై ఆ వివాహ వేడుకను వైభవంగా జరిపించారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సైనికుడికి ‘ఇంత పెద్ద కుటుంబం కారణంగానే పెళ్లి ఘనంగా జరిగింది’ అని భార్య గర్వంగా చెబుతుంది. ఈ వేడుక ‘మమతతోనే మాట మధురం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

సీరియల్స్ నటీనటులు

ఈ వేడుకలో జీ తెలుగు సీరియల్స్​ నటీనటులైన జగద్ధాత్రి- కేదార్, నిండు నూరేళ్ల సావాసం- అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్​, ఆద్య- శ్రీను, రామలక్ష్మి-శౌర్య, భూమితోపాటు మరికొందరు సందడి చేశారు. ఈ బ్రాండ్ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి మనసు దోచేలా ఉంది.

ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. "ప్రేమతో.. జీ తెలుగు క్యాంపెయిన్​ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనేందుకు జీ తెలుగు ఎల్లప్పుడూ ముందుంటుంది" అని అన్నారు.

రీ బ్రాండిగ్ మాత్రమే కాదు

"మన వివాహ పద్ధతిలోని సౌందర్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్​ తెలుగు సంస్కృతి, విలువలు, ఆచారాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం రీ బ్రాండింగ్​ మాత్రమే కాదు, ప్రేక్షకులతో జీ తెలుగు అనుబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు నూతన ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని అనురాధ గూడురు తెలిపారు.

ఈ బ్రాండ్ ఫిల్మ్ భారతదేశంలోనే మొదటిసారిగా ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో రూపొందించిన బహుభాషా సిరీస్‌. 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జీ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి ఈ బ్రాండ్ ప్రసారమైంది.

సింగర్స్ రేవంత్, జయశ్రీ

ప్రముఖ గాయకులు రేవంత్​, జయశ్రీ ఈ బ్రాండ్​ ఫిల్మ్​ తెలుగు ఒరిజినల్​ ట్రాక్‌ను ఆలపించారు. ఈ పాట తెలుగు వారి అనుబంధాలు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను ప్రతిబింబిస్తుందని మేకర్స్ తెలిపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More