ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్ 2లో ఒకటి రొమాంటిక్ కామెడీ, మరొకటి కామెడీ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ సినిమాల్లో తెలుగు మూవీస్ దుమ్ము రేపుతున్నాయి. టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 టాలీవుడ్ కు చెందినవే కాగా.. మొత్తంగా ఐదు మూవీస్ చోటు దక్కించుకున్నాయి.
థియేటర్లలో డిజాస్టర్ అయినా ఓటీటీలో దుమ్ము రేపడం ఈ మధ్య కామనైపోయింది. అలాంటివే రెండు తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో దూసుకెళ్తున్నాయి. వీటిలో ఒకటి రొమాంటిక్ కామెడీ కాగా.. మరొకటి కామెడీ మూవీ కావడం విశేషం. ఇక మొత్తంగా టాప్ 10లోనూ ఐదు తెలుగుకు సంబంధించినవే ఉన్నాయి.

ప్రైమ్ వీడియో ట్రెండింగ్ మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే అడుగుపెట్టిన సినిమాలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సారంగపాణి జాతకం. ఈ రెండు మూవీస్ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం ఇవి రెండూ టాప్ 2 ట్రెండింగ్ లో నిలవడం విశేషం.
యాంకర్ ప్రదీప్, దీపిక పిల్లి లీడ్ రోల్స్ లో నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఇండియాలోనే నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా నిలుస్తోంది. దీని తర్వాత ప్రియదర్శి లీడ్ రోల్లో నటించిన సారంగపాణి జాతకం రెండో స్థానంలో ఉంది. ఈ మూవీ తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
టాప్ 10 విషయానికి వస్తే నాలుగో స్థానంలో తమన్నా నటించిన ఓదెల 2 మూవీ కొనసాగుతోంది. ఇక ఆరో స్థానంలో చౌర్య పాఠం, ఏడో స్థానంలో కల్యాణ్ రామ్ నటించిన 28 డిగ్రీ సెల్సియస్ సినిమాలు ఉన్నాయి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గురించి..
మొదటి సారి మెయిన్ హీరోయిన్‌గా దీపిక పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సినిమా టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. సినిమా అంతా తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో పుట్టిన ఏకైక అమ్మాయి రాజా చుట్టూ తిరుగుతుంది. 60 మందికి ఒక్కరే అమ్మాయి అనే కాన్సెప్ట్, పెళ్లి చేసుకున్న వారే ప్రెసిడెంట్ అవడం వంటివి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
సారంగపాణి జాతకం గురించి..
జాతకాల పిచ్చితో ఓ యువకుడు హత్య చేయాలని అనుకోవడం, ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే థ్రిల్‌ను పంచుతూనే కడుపుబ్బా నవ్విస్తుంది ఈ సారంగపాణి జాతకం మూవీ. మూఢనమ్మకాల వల్ల ఎదురయ్యే అనర్థాలను ఈ మూవీలో చూపించారు. మెసేజ్‌ను సీరియస్‌గా కాకుండా కామెడీతోనే ఈ పాయింట్‌ను చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ప్రియదర్శి, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు నటించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













