...
...
Next Story

Priya Priya Song Lyrics: ప్రియా ప్రియా సాంగ్ లిరిక్స్.. ల‌వ‌ర్‌ను ఇంప్రెస్ చేయడానికి ఈ ఎవ‌ర్ గ్రీన్ ప్రేమ పాట పాడేయండి

మీ ప్రేయసి అలక బూనిందా? లేదా ఆమెను ఇంప్రెస్ చేయాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగర్ గ్రీన్ లవ్ సాంగ్ పాడేయండి. ఈ లిరిక్స్ తో మీ గర్ల్ ఫ్రెండ్ ను మెస్మరైజ్ చేయండి. జీన్స్ మూవీలోని మ్యాజికల్ లవ్ సాంగ్ ‘ప్రియా ప్రియా’ లిరిక్స్ మీకోసం.

Published on: Apr 20, 2025, 10:14:20 IST
By ,
Prefer HTon Google
Advertisement

పొగిడితే పడిపోని వారు ఎవరుంటారు? ఇక తన ప్రేయసిని వర్ణిస్తూ ప్రియుడు పాట పాడితే ఎలాంటి అమ్మాయి అయినా ఇంప్రెస్ కావాల్సిందే. ఇదిగో ఈ సాంగ్ అలాంటిది. ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటైన ‘ప్రియా ప్రియా’ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటోంది. అమ్మాయిని పొగడటంతో పాటు ఆమె కోసం ప్రాణాలైనా ఇస్తా అంటూ ఈ సాంగ్ లో ప్రియుడు పడే తపన కనిపిస్తోంది.

సూపర్ హిట్

ప్రియా ప్రియా సాంగ్ (youtube)
ప్రియా ప్రియా సాంగ్ (youtube)

1998లో వచ్చిన ‘జీన్స్’ సినిమాలోని ‘ప్రియా ప్రియా’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇది తమిళ్ ఒరిజినిల్ మూవీ అయినప్పటికీ.. తెలుగులో ఈ సాంగ్ కోసం శివగణేష్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఈ పాటను అంతే అమేజింగ్ గా జీన్స్ శ్రీనివాస్ ఆలపించారు. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే.. ఈ మూవీ నేమ్ సింగర్ ఇంటి పేరుగా మారిపోయింది.

ఇక ఈ సాంగ్ లో అందాల తార ఐశ్వర్య రాయ్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ వేరే లెవల్. హీరో ప్రశాంత్ తో ఆమె కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.

ఇవే లిరిక్స్

పల్లవి:

ప్రియా ప్రియా చంపొద్దె.. నవ్వి ననే ముంచొద్దే

చెలి కన్నులతో హృదయం కాల్చొదే

అయ్యో.. వన్నెలతో ప్రాణం తీయోద్దే

ప్రియా ప్రియా చంపొద్దె.. నవ్వి ననే ముంచొద్దే

చరణం 1:

చెలియా నీదు నడుమును చూశా అరెరే బ్రహ్మెంత పిసినారి

తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే ఆహా.. అతడే చమత్కారి

మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమాట

నూరడుగుల శిలా ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట

అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట

ప్రియా ప్రియా చంపొద్దె.. నవ్వి ననే ముంచొద్దే

(అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేనా

అందమైన నదివె నదివె చెలి మేని సొగసు తెలిపేవా

అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేవా

అందమైన మణివే మణివే గుండె గుబులు తెలిపేవా)

చరణం 2:

చంద్రగోళంలో ఆక్సీజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా

నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా

మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిను జో కొడతా

నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా

పంచవన్నె చిలక జలకాలాడగా మంచుబిందువులే సేకరిస్తా

దేవత జలకాలాడిన జలమును గంగ జలముగా సేవిస్తా

ప్రియా ప్రియా చంపొద్దే

ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి ననే ముంచొద్దే

చెలి కన్నులతో హృదయం కాల్చొదే

అయ్యో.. వన్నెలతో ప్రాణం తీయోద్దే

ప్రియా ప్రియా చంపొద్దె.. నవ్వి ననే ముంచొద్దే

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe