నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్

ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. గురువారం (అక్టోబర్ 16) ఈ సినిమా రిలీజ్ కానుండగా.. బుధవారం (అక్టోబర్ 15) మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Oct 15, 2025 6:26 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ వస్తోంది. ఈ మూవీ పేరు మిత్ర మండలి. ప్రియదర్శి, విష్ణు, మయూర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా గురువారం (అక్టోబర్ 16) రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గురించి ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అని అంటున్నారని అతడు అనడం విశేషం.

నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్
నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్

ప్రియదర్శి ఏమన్నాడంటే?

మిత్ర మండలి మూవీ టీమ్ బుధవారం (అక్టోబర్ 15) మీడియాతో మాట్లాడింది. ఇందులో ప్రియదర్శితోపాటు నిహారిక, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ లాంటి వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సినిమాలో డ్యాన్స్ చేస్తున్నారెందుకు అని అడగగా.. కథ డిమాండ్ ను బట్టే చేస్తున్నాను తప్ప తానేదో చేసేయాలని కాదని ప్రియదర్శి అన్నాడు. అంతేకాదు ఇప్పుడు నీకు డ్యాన్స్ అవసరమా అని కూడా కొందరు అంటున్నారని అతడు చెప్పడం విశేషం.

జాతి రత్నాలులాంటి కథ వద్దని చెప్పా

జాతి రత్నాలు కథ తనకు బాగా నచ్చి చేశానని, అయితే ఆ తర్వాత 35, కోర్ట్ లాంటి భిన్నమైన కథలతో సినిమాలు చేసినట్లు ప్రియదర్శి చెప్పాడు. తాను ప్రతిసారీ డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నానని, జాతి రత్నాలులాంటి కథ ఎవరైనా చెప్పినా వద్దని అంటానని అన్నాడు. అంతేకాదు ఈ మిత్ర మండలి మూవీ జాతి రత్నాలులాగా అస్సలు ఉండదని కూడా స్పష్టం చేశాడు.

ఇక సినిమాపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించాడు. కావాలని ఎవరో నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ప్రియదర్శి అన్నాడు. ఇక ఈ సినిమాలో ఏదో ఒక క్యాస్ట్ ను కించపరిచేలా తీయలేదని, ఇది మమ్మల్నే అన్నట్లుగా ఉందని మీకనిపిస్తే ఏం చేయలేమని ప్రియదర్శి అన్నాడు.

మిత్ర మండలి సినిమాపై తనకు ఉన్న నమ్మకం వల్లే ఈ సినిమా మీకు నచ్చకపోతే నా తర్వాతి సినిమా చూడొద్దని అని మాట్లాడినట్లు ప్రియదర్శి వివరించాడు. నాని అన్నకు కోర్టు మూవీలాగా.. తనకు ఈ మిత్ర మండలిపై నమ్మకం ఉందని చెప్పాడు. సినిమా కథను తాను విన్నప్పుడు ఎలా అనిపించిందో తెరపైకి అలా వచ్చిందని, అందుకే ఈ సినిమాపై తనకు అంత నమ్మకం కుదిరిందని ప్రియదర్శి స్పష్టం చేశాడు.

మిత్ర మండలి మూవీ గురించి..

తెలుగులో కొన్నేళ్లుగా పెద్దగా కథకు ప్రాధాన్యం లేకుండా కేవలం ఓ ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ల మధ్య జరిగే కామెడీ సీన్లతో సినిమాను నడిపించేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన జాతి రత్నాలు, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. దీంతో ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ఈ మిత్ర మండలి సినిమా వస్తోంది.

ప్రియదర్శి, విష్ణు, వెన్నెల కిశోర్ లాంటి కమెడియన్లు ఉండటంతో ఈ సినిమా కూడా కామెడీకి గ్యారెంటీ ఇస్తోంది. విజయేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News/Entertainment/నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్
News/Entertainment/నీకు ఇప్పుడు డ్యాన్స్ అవసరమా అంటున్నారు.. జాతి రత్నాలులాంటి కథ చెబితే వద్దనే అంటాను: ప్రియదర్శి కామెంట్స్