ప్రియమణి స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ప్రైమ్ వీడియో
మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈ సరికొత్త సీజన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రైమ్ వీడియో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ త్వరలోనే రానుందని ఆ ఓటీటీ వెల్లడించింది.
ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించి తాజాగా సీజన్ 3 కొత్త పోస్టర్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పోస్టర్ ఎలా ఉందంటే?
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కొత్త పోస్టర్‌లో మనోజ్ బాజ్‌పాయీ పాత్ర శ్రీకాంత్ తివారీ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. అంతేకాదు ఉత్కంఠభరితమైన దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలను సూచిస్తూ సీజన్ 3 కథలోని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తున్నాయి.
“మా ఫ్యామిలీ మెన్‌పై అందరి కళ్లు” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో, “కొత్త సీజన్ త్వరలో” అని వెల్లడించింది. ఈ పోస్టర్ సీజన్ 3లో శ్రీకాంత్ తివారీ ఎదుర్కొనే కొత్త సవాళ్లను, దేశ భద్రతతో పాటు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి అతడు పడే పాట్లను హైలైట్ చేస్తోంది.
సీజన్ 3 ఎలా ఉండనుంది?
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3, ఈ ఏడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుందని మనోజ్ బాజ్‌పాయీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. ఈ సీజన్‌లో జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో కనిపించనున్నారని తేలిని విషయం తెలిసిందే. ఇక గత రెండు సీజన్లలో కనిపించిన ప్రియమణి, షరీబ్ హష్మీ, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా వంటి నటీనటులు మూడో సీజన్లోనూ కొనసాగనున్నారు.
సీజన్ 2 ముగింపులో సూచించినట్లు, ఈ సీజన్ కొవిడ్-19 నేపథ్యంలో చైనా నుంచి ఇండియాపై జరిగే దాడుల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ కథ నార్త్ ఈస్ట్ ఇండియా నేపథ్యంలో సాగనుంది. ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో ఈ సీజన్‌ను “రోలర్ కోస్టర్ రైడ్”గా అభివర్ణించింది. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పింది.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి..
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3 షూటింగ్ మే 2024లో ప్రారంభమై, ఇటీవల ముగిసింది. రాజ్ అండ్ డీకే దీన్ని తమ కెరీర్‌లో అత్యంత కష్టమైన షూట్‌గా అభివర్ణించారు. నాగాలాండ్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరిగింది. ఇక ఇప్పుడు కొత్త పోస్టర్ రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“శ్రీకాంత్ తివారీ బ్యాక్ విత్ బ్యాంగ్” అని ఒక అభిమాని కామెంట్ చేయగా, “ఈ సీజన్ బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని మరొకరు రాశారు. తొలి రెండు సీజన్లలాగే ఈ మూడో సీజన్ కూడా గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగనుందని ఆశిస్తున్నారు. అందులోనూ జైదీప్ అహ్లావత్ ఎంట్రీతో ఈ కొత్త సీజన్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ కొత్త సీజన్ ఈ ఏడాది నవంబర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రైమ్ వీడియో ఓ ప్రకటన రిలీజ్ చేయవచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



