...
...
Next Story

ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నా.. దర్శకుడు కథ చెప్పకుండా వెళ్లిపోయాడు.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

ప్రియదర్శి, రాక్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మిత్ర మండలి. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న మంత్రి మండలి టీజర్‌ను జూన్ 12న విడుదల చేశారు. మిత్ర మండలి టీజర్ రిలీజ్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

Published on: Jun 13, 2025, 06:34:50 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నూతన దర్శకుడితో మూవీ

ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నా.. దర్శకుడు కథ చెప్పకుండా వెళ్లిపోయాడు.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్
ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నా.. దర్శకుడు కథ చెప్పకుండా వెళ్లిపోయాడు.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. తాజాగా 'మిత్ర మండలి' టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

మిత్ర మండలి టీజర్ లాంచ్

మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న గురువారం (జూన్ 12) ఉదయం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిత్ర మండలి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

మొదటి సినిమాగా

మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ 'మిత్ర మండలి' టీజర్‌ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను" అని అన్నారు.

యంగ్ స్టర్స్‌తో ఎక్కువ టైమ్

"నేను యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్లిపోయాడు" అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.

అది తెలిసిన మనిషి

"సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. ఫేక్ ఐడెంటిటీతో. నువ్ చాలా స్పీడ్ ఇన్‌స్టాలో. ఒరిజినల్ ఐడీతో ఫాలో అవుతో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతారు. అదంతా ఎందుకనీ. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. మిత్ర మండలి టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe