...
...
Next Story

నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు.. పవన్ కల్యాణ్ వల్ల నిర్మాత అయ్యాను, జీవితమే మారిపోయింది: బండ్ల గణేష్

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన బండ్ల గణేష్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన స్పీచ్‌తో అలరించారు.

Published on: Jun 2, 2025, 13:35:59 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. నటుడిగా పలు సినిమాలతో అలరించిన బండ్ల గణేష్ ఆంజనేయులు, తీన్‌మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే

నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు.. పవన్ కల్యాణ్ వల్ల నిర్మాత అయ్యాను, జీవితమే మారిపోయింది: బండ్ల గణేష్
నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు.. పవన్ కల్యాణ్ వల్ల నిర్మాత అయ్యాను, జీవితమే మారిపోయింది: బండ్ల గణేష్

అయితే, తెలుగులో సూపర్ హిట్ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు జూన్ 1. ఆదివారం నాడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో నిర్వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు నిర్మాత బండ్ల గణేష్‌తోపాటు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

బండ్ల గణేష్ కామెంట్స్

ఈ వేడుకల్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికంటే ముందుగా స్టేజ్ ఎక్కిన బండ్ల గణేష్ తనకు నట జీవితం ప్రసాదించిన ఎస్‌వి కృష్ణారెడ్డి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.

ఎలా ఉండాలో నేర్పారు

అనంతరం నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. "ఎస్వీ కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడితే నా తండ్రి గురించి మాట్లాడినట్లు ఉంటుంది. నాకు యాక్టింగ్ రాకున్నా వినోదం సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పించారు" అని అన్నారు.

ఊహించని విధంగా మారింది

"అలా నటుడిగా కొనసాగిన నేను పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి వల్ల నిర్మాతను అయ్యాను. దాంతో నా జీవితం ఊహించని విధంగా మారిపోయింది"అని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తెలిపారు.

మా ఇంట్లో వేడుక ఉన్నా

"ఎస్వీ కృష్ణా రెడ్డి ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడిన వ్యక్తిని నేను. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఎన్నో గొప్ప చిత్రాల రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ సినిమాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎస్వీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది" అని నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఎస్‌వీ కృష్ణారెడ్డి సినిమాలు

ఇదిలా ఉంటే, డైరెక్టర్ ఎస్‌వీ కృష్ణారెడ్డి కొబ్బరిబొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, నంబర్ వన్, శుభలగ్నం, టాప్ హీరో, ఘటోత్కచుడు, వినోదం, వజ్రం, సంప్రదాయం, మావిచిగురు, ఎగిరే పావురమా వంటి అనేక సూపర్ హిట్ తెలుగు సినిమాలకు డైరెక్షన్ చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks