ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమా ప్రారంభించాలనే సెంటిమెంట్ ఉంది, హనుమాన్ స్థాయిలో ఇది హిట్ అవ్వాలి: నిర్మాత సి కల్యాణ్

తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన మైథలాజికల్ సినిమా గదాధారి హనుమాన్. రవి కిరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. తాజాగా శుక్రవారం (జులై 11) గదాధారి హనుమాన్ టీజర్ రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సి కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jul 12, 2025, 06:25:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు.

ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమా ప్రారంభించాలనే సెంటిమెంట్ ఉంది, హనుమాన్ స్థాయిలో ఇది హిట్ అవ్వాలి: నిర్మాత సి కల్యాణ్
ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమా ప్రారంభించాలనే సెంటిమెంట్ ఉంది, హనుమాన్ స్థాయిలో ఇది హిట్ అవ్వాలి: నిర్మాత సి కల్యాణ్

గదాధారి హనుమాన్ టీజర్ లాంచ్

శుక్రవారం (జులై 11) నాడు గదాధారి హనుమాన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ప్రశాంత్ వర్మకు నాతోనే

ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ .. "హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

మూడు భాషల్లో

"హనుమాన్‌ను నమ్ముకున్న వారంతా విజయాన్ని సాధిస్తారు. గదాధారి హనుమాన్ టీజర్ అద్భుతంగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ప్రొడ్యూసర్ సి. కల్యాణ్ కోరారు.

అద్భుతంగా క్లైమాక్స్

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. "గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఇలాంటి ఓ టైటిల్‌ను పెట్టుకుని సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రవి కిరణ్ ఇది వరకే నాకు కథ చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతోంది" అని చెప్పారు.

ఆ తేడా చూడట్లేదు

"ఇలాంటి చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా? పెద్దదా? అన్న తేడాని ఆడియెన్స్ చూడటం లేదు. రవి కిరణ్ ఈ మూవీతో సూపర్ స్టార్ అవుతారనిపిస్తోంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది" అని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు.

టీజర్ బాగుంది

"గదాధారి హనుమాన్ ఈవెంట్‌కు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. దర్శకుడు రోహిత్ నాకు మంచి మిత్రుడు. టీజర్ బాగుంది. రవి కిరణ్ ఈ చిత్రంతో మరోసారి పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను" అని తెలుగు దర్శకుడు సముద్ర పేర్కొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More