...
...
Next Story

ఎవరైనా రివ్యూస్ రాసేటప్పుడు అది ఆలోచించాలి.. నితిన్ తమ్ముడు నిర్మాత దిల్ రాజు కామెంట్స్

నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు ఇవాళ (జూలై 4) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 4, 2025, 10:42:03 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సరికొత్త తెలుగు మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా ఇవాళ (జూలై 4) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మూవీ రివ్యూస్‌పై నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సూపర్ హిట్ దక్కినట్లే

ఎవరైనా రివ్యూస్ రాసేటప్పుడు అది ఆలోచించాలి.. నితిన్ తమ్ముడు నిర్మాత దిల్ రాజు కామెంట్స్
ఎవరైనా రివ్యూస్ రాసేటప్పుడు అది ఆలోచించాలి.. నితిన్ తమ్ముడు నిర్మాత దిల్ రాజు కామెంట్స్

-తమ్ముడు మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన మీ అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే.

సింపుల్ స్టోరీనే

-కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా, తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌తో వెళ్తూ ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.

యాటిట్యూడ్ వచ్చిందంటారు

-పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్‌తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్‌కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్‌కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు యాటిట్యూడ్ వచ్చింది అంటారు.

అనిల్ బాగా ప్లాన్ చేసి

-నిర్మాతగా సినిమాను బాగా రెడీ చేసి ప్రాపర్‌గా రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వారికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు డైరెక్టర్ అనిల్ బాగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా మేము అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది.

ముందే ఓటీటీ ప్రకటించడం

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe