బాలకృష్ణ మూవీలా ఉంటుందా అంటున్నారు.. రెమ్యునరేషన్ గురించి నితిన్ అలా అన్నాడు.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న న్యూ తెలుగు ఫిల్మ్ తమ్ముడు. హీరో నితిన్, లయ, వర్ష బొల్లమ్మ నటించిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ జూన్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు తమ్ముడు సినిమాను బాలకృష్ణ మూవీతో పోల్చడం, నితిన్ రెమ్యునరేషన్‌పై కామెంట్స్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమల్లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన దిల్ రాజు మళ్లీ నితిన్‌తో నిర్మించిన మూవీ తమ్ముడు. జూన్ 11న తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ ముద్దుల మావయ్య మూవీతో తమ్ముడుని పోల్చడం, నితిన్ రెమ్యునరేషన్‌పై మాట్లాడారు.

బాలకృష్ణ మూవీలా
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు" అని అన్నారు.
"ఈ సినిమా ముద్దుల మావయ్య (బాలకృష్ణ మూవీ)లా ఉంటుందా అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ. అయితే కొత్త కాన్సెప్ట్ మూవీ. దీనికి రిఫరెన్స్ లేదు. తమ్ముడు ట్రైలర్ చూశారు. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్‌లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని, తమ్ముడు మూవీనే ఒక రిఫరెన్స్‌గా ఉంటుందని నమ్ముతున్నాం" అని దిల్ రాజు తెలిపారు.
ఎగ్జామ్ రాశాం
"సిస్టర్ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు శ్రీరామ్ వేణు యూఎస్‌లో ఉన్న లయ గారిని అప్రోచ్ అయి, స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. లయ గారు మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. కాంతార తర్వాత సప్తమి గౌడను మంచి క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేశాడు వేణు" అని దిల్ రాజు పేర్కొన్నారు.
"నితిన్‌కు తమ్ముడు మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మన మీడియా మిత్రుల నుంచి ఫోన్స్ , మెసేజెస్ వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా మూవీ ఆడియెన్స్‌కు నచ్చుతుందని నమ్ముతున్నాం" అని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఈ రోజు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకురావడం కష్టంగా ఉంది. మా ట్రైలర్ నచ్చింది కాబట్టి మీడియా మిత్రులు మా మూవీకి బాగా ప్రచారం కల్పించారు. గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్‌గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ అంతా ఒక మంచి మూవీ చేసేందుకు కష్టపడ్డారు. థియేట్రికల్‌గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు. మీరు తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు" అని దిల్ రాజు అన్నారు.
ఒక్క రూపాయి కూడా
"తమ్ముడు మేకింగ్ టైమ్‌లో టెక్నికల్‌గా క్వాలిటీ కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సివచ్చింది. వేణును పిలిచి అడిగితే ఈ సినిమాకు విజువల్, సౌండ్ క్వాలిటీగా చేస్తున్నామని అన్నాడు. బడ్జెట్ గురించి చెప్పగానే, నేను ఇప్పటినుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అన్నాడు" అని దర్శకుడి గురించి చెప్పారు దిల్ రాజు.
"అలాగే నితిన్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెబితే రాజు గారు మీరు ఎంత పంపిస్తారో పంపించండి నా రెమ్యునరేషన్గురించి పెద్దగా డిమాండ్ చేయను అన్నారు. ప్రొడ్యూసర్ పరిస్థితి తెలుసుకుని డైరెక్టర్, హీరో ఇలా సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఇది ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకురావాలి. సినిమా సక్సెస్ అయితే అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. కానీ, ఫ్లాప్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు" అని దిల్ రాజు వివరించారు.
జెన్యూన్‌గా తీసుకెళ్లాలి
"తమ్ముడు మూవీ ట్రైలర్‌కు జెన్యూన్‌గా ఎన్ని వ్యూస్ వస్తాయో అంతే చెప్పాలనుకున్నాం. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఈ పొజిషన్‌ను కాపాడాలంటే అందరం కష్టపడాలి. ప్రతి సినిమాను జెన్యూన్‌గా ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. అందుకు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా కావాలి" అని నిర్మాత దిల్ రాజు కోరారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



