...
...
Next Story

డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్ కొనొద్దని చెప్పాను.. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచడం లేదు.. ఆ ధైర్యం నాకుంది: దిల్ రాజు

తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వివిధ అంశాలపై అతడు స్పందించాడు. ముఖ్యంగా యూట్యూబ్ లో డబ్బులిచ్చి నకిలీ వ్యూస్ తెచ్చుకోవడం, టికెట్ల ధరలు వంటి అంశాలపై మాట్లాడాడు.

Published on: Jun 11, 2025, 22:07:42 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

నితిన్ నటించిన తమ్ముడు మూవీ ట్రైలర్ బుధవారం (జూన్ 11) లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తమ్ముడు మూవీ టికెట్ల ధరలను పెంచబోమని, అంతేకాదు ఈ ట్రైలర్ కు వచ్చే వ్యూస్ పూర్తిగా ఒరిజినల్ అని అతడు చెప్పడం గమనార్హం.

డబ్బులిచ్చి వ్యూస్ వద్దన్నాను

డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్ కొనొద్దని చెప్పాను.. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచడం లేదు.. ఆ ధైర్యం నాకుంది: దిల్ రాజు
డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్ కొనొద్దని చెప్పాను.. ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచడం లేదు.. ఆ ధైర్యం నాకుంది: దిల్ రాజు

ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. యూట్యూబ్ లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూసే ఉంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఇక నుంచి తన సినిమాలకు మాత్రం అలాంటివి వద్దని తన పీఆర్ టీమ్ కు కచ్చితంగా చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతడు ఈ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమా నుంచే దీనిని మొదలు పెడుతున్నామని చెప్పాడు. డబ్బులిచ్చి వ్యూస్ కొనడం వల్ల అసలు కంటెంట్ ప్రేక్షకులకు ఎంత వరకూ రీచ్ అవుతుందన్నది తెలియడం లేదని, ఒరిజినల్ వ్యూస్ వల్లే అది తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ అని, దానిని మంచి కంటెంట్ తో అలా నిలబెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఇలా అందరిపై ఉందని అతడు అన్నాడు.

హీరోల రెమ్యునరేషన్లపై..

తమ్ముడు సినిమాకు హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇంత వరకూ రెమ్యునరేషన్ తీసుకోలేదని, రిలీజ్ తర్వాతే తీసుకుంటారని చెప్పారని ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించాడు. మరి హీరోల రెమ్యునరేషన్లను ప్రొడ్యూసర్లే వెంట పడి పెంచుతున్నారని, ఈ నేపథ్యంలో అందరు హీరోలను ఇలా అడిగే ధైర్యం నిర్మాతలకు ఉందా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. దిల్ రాజుకు ఉంది అని అతడు అనడం గమనార్హం.

ఇక టికెట్ల ధరల పెంపు గురించి కూడా ఈ సందర్భంగా దిల్ రాజు స్పందించాడు. తమ్ముడు సినిమాకు ఎలాంటి పెంపు ఉండబోదని స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి చర్యలతోపాటు క్యాంటీన్ ధరలు తగ్గించడం, మంచి సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe