పల్లెటూరి అమ్మాయి ఎలా ఎదిగిందనే కథతో ఓటీటీ వెబ్ సిరీస్.. దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి కామెంట్స్
ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్న తెలుగు రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జూన్ 6న దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ ప్రెస్ మీట్‌లో దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న సరికొత్త తెలుగు సూపర్ నాచురల్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. హీరోయిన్ రీతు వర్మ ఈ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా చేశారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషించాడు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో
బి కిశోర్ దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను సుధాకర్ చాగంటి నిర్మించారు. జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 3న మీడియాకు రెండు ఎపిసోడ్స్‌ను ప్రదర్శించారు. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఓటీటీ సిరీస్
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. "దేవిక అండ్ డానీ వంటి సిరీస్‌తో మీ ముందుకు రానుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఏడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్. జియో హాట్స్టార్ వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. జూన్ 6న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషన్స్ అన్నీ
"ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉండే సిరీస్ ఇది. నందినిగారికి థాంక్స్. ఆమె ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కిశోర్ గారు సిరీస్‌ను చక్కగా తెరకెక్కించారు. వెంకట్ గారు ఫెంటాస్టిక్ విజువల్స్ అందించారు. దీపక్ రాజ్ గారు కథ, డైలాగ్స్ ఇచ్చినందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్" అని ప్రొడ్యూసర్ సుధాకర్ చాగంటి తెలిపారు.
దేవిక పాత్రలో రీతు వర్మ
"దేవిక పాత్రలో రీతు వర్మ అద్భుతంగా నటించారు. ఓ పల్లెటూరులో ఉండే ఓ అమ్మాయి ఎలా ఎదిగిందనే కథతో ఇది రూపొందింది. డానీ పాత్రలో సూర్య, సుబ్బు పాత్రలో శివ కందుకూరి చక్కగా నటించారు. అందరికీ థాంక్స్. ప్రతి ఒక్కరూ జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీని చూడాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత సుధాకర్ చాగంటి పేర్కొన్నారు.
దేవిక అండ్ డానీ నటీనటులు
ఇదిలా ఉంటే, ఈ ప్రెస్ మీట్‌లో మౌనిక, నందిని, సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి. దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఇక జూన్ 6 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానున్న దేవిక అండ్ డానీ ఓటీటీ సిరీస్‌లో హీరో హీరోయిన్స్‌తోపాటు కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



