20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సైన్ చేశారు.. రష్మిక మందన్నా గురించి అందరికి తెలుసు.. కుబేర మూవీ నిర్మాతల కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్నా, కింగ్ నాగార్జున తొలిసారి కలిసి నటించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. రీసెంట్‌గా కుబెర, ధనుష్ కథ ఓకే చేయడంపై నిర్మాతలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

Published on: Jun 13, 2025, 12:45:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించిన సినిమా కుబేర. హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సైన్ చేశారు.. రష్మిక మందన్నా గురించి అందరికి తెలుసు.. కుబేర మూవీ నిర్మాతల కామెంట్స్
20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సైన్ చేశారు.. రష్మిక మందన్నా గురించి అందరికి తెలుసు.. కుబేర మూవీ నిర్మాతల కామెంట్స్

హై బడ్జెట్‌తో కుబేర

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ట్రెండింగ్‌లో కుబేర సాంగ్స్

పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

'కుబేర' ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయింది?

-శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశాము.

రష్మిక గురించి అందరికి తెలుసు

-ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

హిందీలో డబ్ చేసి

-కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More