ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. వీధుల్లో నిరుపేదవాడు.. నాగార్జున, ధనుష్, రష్మిక మూవీపై నిర్మాతల కామెంట్స్
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన తొలి తెలుగు మూవీ కుబేర. పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాను నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. కుబేర మూవీ కాన్‌ఫ్లిక్ట్ ఏంటీ అనే ప్రశ్నపై నిర్మాతలు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. తెలుగు పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ములదర్శకత్వం వహించిన కుబేర సినిమాకు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.

జూన్ 20న కుబేర రిలీజ్
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసిఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో కుబేర సినిమాను నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా కుబేర సినిమా విడుదల కానుంది.
కుబేర కాన్‌ఫ్లిక్ట్
ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ఇంటర్వ్యూలో కుబేర కాన్‌ఫ్లిక్ట్ ఏంటీ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
కుబేర కథలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?
-శేఖర్ కమ్ముల గారు మంచి ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి.
దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?
దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవి శ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.
కుబేర కాన్‌ఫ్లిక్ట్ ఏమిటి?
-మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ (ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు), ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ (వీధుల్లోనే నిరుపేద) ఇది కాన్‌ఫ్లిక్ట్.
తమిళ్‌లో కూడా మీరే రిలీజ్ చేస్తున్నారా?
-లేదండి. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చాము.
సునీల్ గారు.. మీ అమ్మాయి జాన్విని నిర్మాతగా చేయాలనే భావిస్తున్నారా?
-కచ్చితంగా అండి. తనకి సినిమా నిర్మాణం పట్ల చాలా ఆసక్తి ఉంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే మా బ్రదర్ వాళ్ల అబ్బాయికి కూడా ప్రొడక్షన్‌పై ఆసక్తి ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?
-శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



