మరో రెండు భాషల్లోకి తెలుగు సైకలాజికల్ హారర్ ఫిల్మ్.. ఆత్మ చెప్పినట్లు చేసే యువకుడు.. ఏ ఓటీటీల్లో ఉందంటే?

తెలుగు సైకలాజికల్ హారర్ సినిమా ఘటికాచలం ఓటీటీలో మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జూన్ 20న రెండు ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

Published on: Jun 25, 2025, 13:04:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులోనూ ఈ మధ్య కొత్త కొత్త కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో సత్తాచాటేందుకు ట్రై చేస్తున్నారు. అలా వచ్చిందే ‘ఘటికాచలం’ సినిమా. ఈ చిన్న సినిమాను డైరెక్టర్ మారుతి సమర్పించడం, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అంచనాలు కలిగాయి. కానీ థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం ఓటీటీలో అదరగొడుతోంది.

ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా (x)
ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా (x)

రెండు ఓటీటీల్లో

జూన్ 20న ఓటీటీలోకి వచ్చింది ఘటికాచలం సినిమా. ఒకే సారి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. అందుకే ఇప్పుడు మరో రెండు భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేశారు.

ఆ భాషల్లోకి

కేవలం తెలుగులోనే థియేటర్లలో రిలీజై, ఓటీటీలోకి వచ్చేసిన ఘటికాచలం సినిమా ఇప్పుడు మరో రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు హిందీ భాషలోనూ బుధవారం (జూన్ 25) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఉయ్యాల జంపాలా, బాహుబలి తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లాడు గుర్తున్నాడా? అతని పేరు నిఖిల్ దేవాదుల. ఘటికాచలం సినిమాలో అతనే హీరో. అతని చుట్టూనే మొత్తం సినిమా తిరుగుతోంది. మే 31న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.

కథ ఏమిటంటే?

కౌశిక్ (నిఖిల్ దేవాదుల) ఎంబీబీఎస్ చదువుతుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేక డాక్టర్ కోర్సు చేస్తుంటాడు. అయితే తనకు ఇష్టం లేకపోయినా రోజూ హీరోయిన్ కోసం కాలేజీకి వెళ్తాడు. సంయుక్తను ప్రేమిస్తాడు కౌశిక్. కానీ జార్జ్ కూడా సంయుక్తను ప్రేమిస్తాడు. దీంతో జార్జ్ అంటే కౌశిక్ కు పడదు.

ఒంటరిగానే

కౌశిక్ ఫస్ట్ నుంచి ఒంటరిగానే ఉంటాడు. అయితే తన శరీరాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతుంటాడు. ఎవరో చెప్తే తాను చేస్తున్నట్లు అనిపిస్తుంది కౌశిక్ కు. ఆ వాయిస్ విని విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అతణ్ని చూసి అందరూ భయపడతారు.

అయితే కౌశిక్ ను ఘటికాచలం అనే ప్రేతాత్మ ఆవహించిందని అతని పేరేంట్స్ అనుకుంటారు. మరి ఆ ఆత్మ ఎవరు అనేది తెలుసుకోవడానికి కౌశిక్ తండ్రి ప్రయత్నిస్తాడు. మరి నిజంగానే ఆ ఆత్మ ఉందా? ఘటికాచలం ఎవరు? కౌశిక్ కు చివరకు ఏం జరిగింది? అనేది మిగతా కథ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను మీరూ ఓ లుక్కేయండి మరి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More