హిందీలోనూ పుష్ఫ మేనియా.. టీవీ ప్రీమియర్ లో రికార్డు రేటింగ్.. ఆ బ్లాక్ బాస్టర్లను దాటేసి.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

పుష్పరాజ్ గా బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పుష్ప ది రైజ్, పుష్ఫ ది రూల్ మూవీస్ తో రికార్డు కలెక్షన్లు కుమ్మేశారు. పుష్ఫ 2 మూవీ టీవీ ప్రీమియర్స్ లోనూ అదరగొడుతోంది. రీసెంట్ గా హిందీ ప్రీమియర్ లో ఈ మూవీ సత్తాచాటింది. 

Published on: Jun 14, 2025, 15:29:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేటర్లలో రికార్డులు ఊచకోత కోసి.. ఓటీటీలోని వరల్డ్ వైడ్ గా దుమ్మురేపిన పుష్ప 2 మూవీ.. టెలివిజన్ ప్రీమియర్ లోనూ అదరగొట్టింది. తెలుగులో స్టార్ మాలో ప్రీమియర్ అయిన ఈ సినిమా రికార్డు టీవీ రేటింగ్ ను సాధించగా.. ఇప్పుడు హిందీ ప్రీమియర్ లోనూ హిస్టరీ క్రియేట్ చేసింది. పుష్ప ది రూల్ మేనియా హిందీలోనూ సాగుతోంది అనేందుకు ఈ టీఆర్పీ రికార్డులే నిదర్శనం.

పుష్ప 2 లో అల్లు అర్జున్ (x/PushpaMovie)
పుష్ప 2 లో అల్లు అర్జున్ (x/PushpaMovie)

హిందీ ప్రీమియర్ లో హిస్టరీ

పుష్ప 2 ది రూల్ మూవీ హిందీ ప్రీమియర్ లో సత్తాచాటింది. టీవీ టెలికాస్ట్ లో అదరగొట్టింది. మే 31న జీ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా హిందీలో టీవీలోకి వచ్చింది పుష్ఫ 2. తాజా బార్క్ గణాంకాల ప్రకారం టీవీ ప్రీమియర్ లో హిందీలోనూ పుష్ప 2 సంచలనం నమోదు చేసింది. 5.1 టీవీ రేటింగ్ సాధించింది. 5.4 కోట్ల మంది ఈ మూవీని హిందీలో చూశారు.

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేనియాకు ఇది మరో నిదర్శనం. ఈ విషయాన్ని పుష్ప మూవీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

టీ20 లీగ్ ను మించి

సాధారణంగా టీ20 లీగ్ యావరేజ్ టీ20 రేటింగ్ 3.9 కాగా.. పుష్ప 2 అంతకంటే ఎక్కువ సాధించిందని గిరీష్ పోస్టు చేశారు. 2024 డిసెంబర్ 5న థియేటర్లకు వచ్చిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 2025 జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో 2025 ఏప్రిల్ 13న స్టార్ మా లో టీవీల్లోకి వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మంధాన జోడీగా నటించారు.

తగ్గేదే లే

హిందీ టీవీ ప్రీమియర్ లో పుష్ఫ 2 తగ్గేదేలేదంటూ దూసుకెళ్లిందని జీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రెవెన్యూ హెడ్ గిరీష్ జోహార్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆయన పోస్టు ప్రకారం హిందీ టీవీ రేటింగ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను పుష్ప 2 వెనక్కి నెట్టింది. రూ.500 కోట్ల క్లబ్ లోని సినిమాల్లో పుష్ప 2కే అత్యధిక రేటింగ్ దక్కింది. బార్క్ గణాంకాలను గిరీష్ షేర్ చేశారు.

పుష్ప 1ను దాటి

కనీసం రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ లో హిందీ ప్రీమియర్స్ లో పుష్ప 1 టాప్ ప్లేస్ లో ఉండేది. ఆ మూవీకి 4.6 టీవీ రేటింగ్ ఉంది. ఇప్పుడు పుష్ప 2 మూవీ దీన్ని దాటేసింది. 5.1 టీవీ రేటింగ్ సాధించేసింది. పుష్ప 2, పుష్ప 1 తర్వాత స్త్రీ 2 (4.3), పఠాన్ (4.2), కేజీఎఫ్ ఛాప్టర్ 1 (4.2), యానిమల్ (2.3) సినిమాలున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More