Ra Macha Macha Song Lyrics: రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో రా మచ్చ మచ్చ.. చిరు వీణ స్టెప్ రీక్రియేట్.. లిరిక్స్ ఇవే

Ra Macha Macha Song: రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రా మచ్చ మచ్చ సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. వేల మంది డ్యాన్సర్లతో కలిసి చరణ్ చేసిన డ్యాన్స్ ఈ పాటకు హైలైట్ గా చెప్పొచ్చు.

Published on: Sep 30, 2024, 18:15:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ra Macha Macha Song: రా మచ్చ మచ్చ అంటూ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆసక్తికరంగా చూస్తున్న రామ్ చరణ్ అభిమానులను.. ఈ పాట ఆనందానికి గురి చేస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ ఈ పాట వచ్చేసింది. ఈ మధ్యే ప్రోమో రిలీజ్ చేయగా.. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 30) లిరికల్ వీడియో వచ్చింది.

రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో రా మచ్చ మచ్చ.. చిరు వీణ స్టెప్ రీక్రియేట్.. లిరిక్స్ ఇవే
రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో రా మచ్చ మచ్చ.. చిరు వీణ స్టెప్ రీక్రియేట్.. లిరిక్స్ ఇవే

రా మచ్చ మచ్చ సాంగ్

రా మచ్చ మచ్చ సాంగ్ మాస్ బీట్ తో ఎంతో ఉత్సాహంగా సాగిపోయింది. రామ్ చరణ్ తోపాటు ఈ పాటలో వేల మంది డ్యాన్సర్లు, కమెడియన్ సత్య, ప్రియదర్శిలాంటి వాళ్లు కూడా కనిపించారు. చాలా రోజుల తర్వాత చరణ్ సోలో స్టెప్పులు చూసే అవకాశం అభిమానులకు దక్కింది. ఇక అందరూ అంచనా వేసినట్లే ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది.

ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇక నకాల్ అజీజ్ ఈ పాట పాడాడు. ఇందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేసింది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఈ పాటలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక దమ్ తు దిఖాజా అంటూ హిందీతోపాటు తమిళంలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు.

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ కాగా.. ఎస్‌జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరాం, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట లిరిక్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. మచ్చ మచ్చ అంటూ రచ్చ చేసేయండి.

రా మచ్చ మచ్చ సాంగ్ లిరిక్స్ ఇవే

కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే..

షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే..

టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే..

నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే..

కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే..

మాటలన్నీ చేతల్లో పెడితే, మీరైనా నాలాంటోళ్లే

రా మచ్చ మచ్చ రా

రా మచ్చ మచ్చ రా

ఈ కచ్చా పచ్చాకే

రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా

రా మచ్చ మచ్చ ర

నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

నిక్కరు జేబు లోపల

చిల్లర కాసు గల్ గలా..

చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా..

వీణ స్టెప్పు వేస్తేనీ

విజిల్ సౌండు దడ దడా

నక్కినదండి గుండెలో ఏదో మూల..

పోచమ్మ జాతరలో తప్పెటగుళ్లు

అరె సంక్రాంతి ఇళ్లలో పందెం కోళ్లు

సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు

గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు

ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే

ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్లే..

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More