చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు...అనే పాయింట్‌తో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గేదెల రాజు కాకినాడ తాలూకా మూవీని రూపొందిస్తోన్నాడు డైరెక్టర్ చైతన్య మోటూరి. ఓ నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి గేదెల రాజు ఏం చేశాడన్నది ఈ సినిమాలో థ్రిల్లింగ్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు.
ప్రజెంటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్...
గేదెల రాజుగా టైటిల్ పాత్రలో నటిస్తూనే ఈ మూవీకి ప్రజెంటర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు రఘు కుంచే. సినిమా మొత్తం రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. కాకినాడ యాస భాషలకు ప్రాముఖ్యతనిస్తూ తెరకెక్కుతోన్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచుతుందని మేకర్స్ చెబుతోన్నారు. రఘు కుంచే యాక్టింగ్‌తో పాటు అతడి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.
గేదెల రాజు కాకినాడా తాలూకా మూవీలో రఘు కుంచేతో పాటు రవిఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాస్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు.
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి...
యాంకర్‌గా రఘు కుంచే కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. బంపర్ ఆఫర్, దేవుడు చేసిన మనుషులు, పలాస 1978 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రఘు కుంచేకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లుగా యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టాడు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాడు.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More