Rahul Gandhi: అది ఆమె ఇష్టం.. స్వేచ్ఛగా ఉంటే ట్రోల్ చేస్తారా?: కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు
Rahul Gandhi: బాలీవుడ్ నటి కృతి సనన్ కు రాహుల్ గాంధీ అండగా నిలిచారు. ఆమె చేసిన రక్షా బంధన్ యాడ్ వివాదంపై స్పందిస్తూ.. ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది.
Rahul Gandhi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) డ్రెస్సింగ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రక్షా బంధన్ యాడ్‌లో కృతి వేసుకున్న అవుట్‌ఫిట్‌పై నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌ను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ వారికే ఉందని ఆయన స్పష్టం చేశారు.

'మహిళల దుస్తులు వారి ఇష్టం'.. రాహుల్ గాంధీ సంచలన పోస్ట్
రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కృతి సనన్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. "ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టం. తమ స్వేచ్ఛను ఉపయోగించుకునే మహిళలను ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి" అని రాహుల్ రాసుకొచ్చారు.
అంతేకాకుండా ఈ పోస్ట్‌తో పాటు '#SmashThePatriarchy' అనే పవర్‌ఫుల్ హాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా మహిళల స్వేచ్ఛకు మద్దతుగా నిలవడం ఇప్పుడు పొలిటికల్, సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వివాదం ఏంటి? జివా యాడ్‌లో ఏం జరిగింది?
వివాదానికి కారణమైన జివా (GIVA) జ్యువెలరీ బ్రాండ్ రక్షా బంధన్ కమర్షియల్ యాడ్‌లో కృతి సనన్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్ ధరించి కనిపించారు. పవిత్రమైన పండుగ రోజు ఇలాంటి రివీలింగ్ డ్రెస్ వేసుకోవడం ఏంటంటూ సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా ఈ యాడ్‌లో పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై కూడా కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కృతి అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచి, సంప్రదాయాల పేరుతో మహిళలను నియంత్రించడం సరైంది కాదని కౌంటర్ ఇచ్చారు.
'సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. నెక్ లైన్‌లో కాదు'.. కృతి ఘాటు స్పందన
ఈ ట్రోల్స్‌పై కృతి సనన్ ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఘాటుగా స్పందించారు. "పండుగ సంస్కృతి, సాంప్రదాయాలు మన గుండెల్లో ఉంటాయి.. మనం వేసుకునే నెక్ లైన్‌లో కాదు" అని ఆమె తేల్చి చెప్పారు.
పండుగ వెనుకున్న భావోద్వేగాలు ముఖ్యమని, మహిళల గౌరవాన్ని వారు వేసుకునే బట్టలతో కొలవడం ఆపాలని కృతి డిమాండ్ చేశారు. తమ పెంపుడు కుక్కలు కూడా తమ కుటుంబంలో భాగమేనని, అందుకే వాటికి కూడా రాఖీ కట్టామని ఆమె స్పష్టం చేశారు.
కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. పీక్‌కు చేరిన వార్
మరోవైపు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఈ విషయంలో కృతి సనన్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నకు రాఖీ కట్టేటప్పుడు వార్డ్‌రోబ్‌లో ఇన్ని ఎథ్నిక్ ఆప్షన్లు ఉండగా బికినీ లేదా ఇన్నర్ వేర్ లాంటి డ్రెస్ ఎందుకు వేసుకోవాలని ఆమె ప్రశ్నించారు.
ఈ యాడ్ కావాలని వికారంగా డిజైన్ చేసినట్లు ఉందని కంగనా కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ రగడలో ఎంటర్ అయి కృతికి సపోర్ట్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


