ప్రీ టీజరే ఇలా ఉందంటే.. ఇక రచ్చ రచ్చే.. అంచనాలు పెంచేసిన రాజాసాబ్.. రేపే టీజర్.. వచ్చే టైమ్ ఇదే!
ఫ్యాన్స్ వెయిటింగ్ కు న్యాయం చేసేందుకు.. ఎదురు చూపులకు తగ్గ కిక్ అందించేందుకు.. డార్లింగ్ ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ టీజర్ రేపే (జూన్ 16) రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ఈ రోజు రిలీజ్ చేసిన ప్రీ టీజర్ అంచనాలు పెంచేసింది.
రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతోంది. ఫ్యాన్స్ ను అలరించేందుకు గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ వచ్చేస్తున్నారు. రాజాసాబ్ మేనియాతో దుమ్ము లేపబోతున్నారు. చాలా కాలం వెయిటింగ్ తర్వాత రాజాసాబ్ నుంచి టీజర్ రాబోతోంది. రేపు (జూన్ 16) రాజాసాబ్ టీజర్ రిలీజ్ కాబోతోంది. అంతకంటే ముందు ఈ రోజు (జూన్ 15) ప్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక టీజర్ ఎలా ఉంటుందో అనే అంచనాలు తారస్థాయికి చేరాయి.

టీజర్ టైమ్ అప్పుడే
రెబల్ వైబ్ స్టార్ట్ అవుతుందంటూ రాజాసాబ్ ప్రీ టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 25 సెకన్ల వీడియోలోనే మూవీలోని హారర్ ను చూపించే ప్రయత్నం చేశారు. ఇందులోనే టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు. జూన్ 16న ఉదయం 10.52 గంటలకు ది రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. టీజర్ మరో రోజు మాత్రమే ఉందంటూ ప్రభాస్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.
రిలీజ్ డేట్
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ థియేటర్లకు ఈ ఏడాది డిసెంబర్ 5న రాబోతోంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందుకు, బిగ్ స్క్రీన్ మీద మరోసారి ప్రతాపం చూపించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ రోజు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్ లో మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు.
ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాలిపోతున్న డబ్బు కట్టల పై నుంచి అగ్నికి ఆహుతవుతున్న ఓ ఎర్రని వస్త్రాన్ని లాగుతున్న ప్రభాస్ ఇంటెన్సివ్ గా కనిపించారు.
హారర్ థ్రిల్లర్
ప్రభాస్ తొలిసారి హారర్థ్రిల్లర్ లో కనిపించబోతున్నారు. ది రాజాసాబ్ మూవీని రొమాంటికి కామెడీ హారర్ థ్రిల్లర్ గా తన మార్క్ స్టైల్లో డైరెక్టర్ మారుతి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ యాక్ట్ చేస్తున్నారు. 2024 జనవరిలో ఈ మూవీని లాంఛ్ చేశారు.
నిజానికి రాజాసాబ్ మూవీని మొదట ఈ ఏడాది ఏప్రిల్ 10కే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ ఇప్పుడు డిసెంబర్ 5కు మారింది. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. సుమారు రూ.350 కోట్లను ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



