అలీపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. అసభ్య పదం వాడిన సీనియర్ యాక్టర్.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు

రాజేంద్ర ప్రసాద్ నోరు జారారు. స్టార్ కమెడియన్ అలీపై అసభ్య వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత అదుపు తప్పి మాట్లాడారు. నెటిజన్లు దీనిపై ఆగ్రహిస్తున్నారు.

Published on: Jun 1, 2025, 18:32:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వార్నర్‌పై కూడా..

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్పై కూడా ఇటీవల రాబిన్‍హుడ్ సినిమా ప్రమోషన్లలో నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. ఆ చిత్రంలో క్యామియో రోల్‍లో నటించిన వార్నర్‌పై అసభ్య పదం వాడారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‍పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు అలీపై నోరు జారారు.

అలీపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. అసభ్య పదం వాడిన సీనియర్ యాక్టర్.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు
అలీపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. అసభ్య పదం వాడిన సీనియర్ యాక్టర్.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు

కాగా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన షష్టిపూర్తిచిత్రం మే 30వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహించగా.. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

సీనియర్ నటుడు, అలనాటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఇటీవలి కాలంలో తరచూ నోరు జారుతున్నారు. వేదికలపై అదుపు తప్పి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి అదే తీరు కొనసాగించారు రాజేంద్ర ప్రసాద్. స్టార్ కమెడియన్ అలీపై తాజాగా అసభ్య కామెంట్ చేశారు. ఆ వివరాలు ఇవే..

అలీని అసభ్యపదంతో..

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 1) ఓ కార్యక్రమం జరిగింది. దీనికి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్‍, శ్రీకాంత్, అలీతో పాటు చాలా మంది నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

అలీ ఎక్కడ అంటూ ఓ అసభ్య పదాన్ని రాజేంద్ర ప్రసాద్ వాడారు. “ఏరా అలీగా.. ఎక్కడ ఆ ల******కు.. ఇటురా బే” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలీ నవ్వినా ఇబ్బంది పడినట్టు కనిపించింది.

బుద్ధి లేదా.. చప్పట్లు కొట్టరా..

తాను ఎన్టీఆర్ అవార్డు తీసుకునేందుకు విజయవాడ వెళ్లాల్సి వచ్చిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవార్డు విషయం చెప్పినా ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఆయన మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. “చప్పట్లు కొట్టరా.. బుద్ది ఉందా లేదా.. ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టారా.. బ్రెయిన్ పోయిందా” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చెప్పి మరీ కొట్టించుకుంటున్నారని మురళీ మోహన్ సరదాగా అంటే.. దానికి చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్టు లెక్క అని నోరు జారారు రాజేంద్ర ప్రసాద్.

నెటిజన్ల ఫైర్

అలీపై అభ్యంతరకరంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్‍పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు పదేపదే ఇలా అసభ్యంగా, వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని ఆగ్రహిస్తున్నారు. ఏదైనా కార్యక్రమానికి ఆయనను పిలిచేందుకు ఆలోచించుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అలీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More