Akhil Raj: మా అమ్మను తిడితే చూస్తూ ఊరుకోవాలా? ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చి తిట్టాడు: రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్
Akhil Raj: డెలివరీ బాయ్ పై దౌర్జన్యం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నటుడు అఖిల్ రాజ్ దీనిపై వివరణ ఇచ్చాడు. 8 నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న విమర్శలపై అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Akhil Raj: 'రాజు వెడ్స్ రాంభాయ్' సినిమాతో రీసెంట్‌గా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ యాక్టర్ అఖిల్ రాజ్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవకు దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో అఖిల్ రాజ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడంపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వివాదం బాగా ముదరడంతో తాజాగా అఖిల్ రాజ్ ఒక ఎమోషనల్ క్లారిఫికేషన్ వీడియో రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ కట్‌గా వివరించాడు.

అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే?
అఖిల్ రాజ్ మంగళవారం (జూన్ 30) ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సుమారు 8 నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అసలు గొడవకు కారణమేంటో అతడ వివరించాడు.
"మేము అసలు ఆ రోజు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కానీ ఒక డెలివరీ బాయ్ మా ఇంటికి పార్సిల్ తెచ్చాడు. మా అమ్మ ఆ పార్సిల్ తీసుకుని ఇది ఎవరు ఆర్డర్ చేశారు అని అడిగింది. ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలుసుకుని, ఆ పార్సిల్‌ను పక్కన పెట్టింది. ఓ 20 నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ మళ్లీ వెనక్కి వచ్చాడు. కాస్త ఓపెన్ అయిందని చెబుతూనే మా అమ్మ తిరిగి ఇవ్వడానికి వెళ్లింది. ఫ్రీగా వస్తే తీసుకుంటారే అంటూ అతడు మా అమ్మను తిట్టాడు. ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చాడు. ఎవరైనా మీ అమ్మను ఇలాగే తిడితే ఊరుకుంటారు. ఎవరూ ఊరుకోరు కదా" అని అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కొడుకుగా నా అమ్మ కోసం స్టాండ్ తీసుకున్నా
అసలు విషయం తెలియకుండా డెలివరీ బాయ్ తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో గొడవ పడటం స్టార్ట్ చేశాడని అఖిల్ తెలిపాడు. ఒక కొడుకుగా నా కళ్ల ముందే మా అమ్మను అంత మాట అంటుంటే తట్టుకోలేకపోయానని, అందుకే అతన్ని పద్ధతిగా ప్రవర్తించమని వార్నింగ్ ఇచ్చానని చెప్పాడు.
కానీ ఆ డెలివరీ బాయ్ కావాలనే వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడని, ఇప్పుడు నెట్‌లో సగం వీడియో మాత్రమే చూసి చాలా మంది తనను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారని అఖిల్ రాజ్ వాపోయాడు.
కండోమ్స్ కూడా వచ్చాయి
అయితే ఇలా తప్పుడు అడ్రెస్ తో తన ఇంటికి ఆర్డర్లు రావడం ఇదే తొలిసారి కాదని, పదిసార్లు ఇలా జరిగిందని అఖిల్ తెలిపాడు. ఎదురు అపార్ట్‌మెంట్ వాళ్ల వల్ల ఇలా జరుగుతోందని, గతంలో కండోమ్స్, సిగరెట్ ప్యాకెట్లు కూడా తన అడ్రెస్ కు వచ్చాయని, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారని ప్రశ్నించాడు. తాజా గొడవలో ఆ డెలివరీ బాయ్ ఏదో అమాయకుడు అన్నట్లుగా అందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారని, అతడు ఏం చేశాడో చూస్తే తెలుస్తుందని అఖిల్ చెప్పాడు.
నేను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేశా
"నన్ను ట్రోల్ చేస్తున్న వారిని నేను ఒకటే అడుగుతున్నా. మీ ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ప్రశాంతంగా ఉంటారా? నిజానికి నేను ఈ ఇష్యూను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఉంటే మరింత మెచ్యూర్డ్‌గా ఉండేది. కానీ మా అమ్మను దూషించే సరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే, ఒకప్పుడు నేనూ డెలివరీ బాయ్‌గా జాబ్ చేశాను. మా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే మాట్లాడాం. అలాంటిది నాకై నేను ఎందుకు గొడవ పతాను? దీని వల్ల నాకు వచ్చే లాభం ఏంటి?" అంటూ అఖిల్ రాజ్ తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఈ యంగ్ యాక్టర్ ఇచ్చిన క్లారిఫికేషన్‌తో సోషల్ మీడియాలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మొదట అతన్ని తప్పుపట్టిన నెటిజన్లు, ఇప్పుడు డెలివరీ బాయ్ ప్రవర్తనను కూడా తప్పుబడుతూ అఖిల్‌కు సపోర్ట్ ఇస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


