...
...
Next Story

రవితేజ ఇడియట్ హీరోయిన్ రక్షిత సోదరుడు హీరోగా ఏలుమలై- పూరి జగన్నాథ్‌తో టీజర్, కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో పోస్టర్ రిలీజ్

రవితేజ ఇడియట్ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన రక్షిత సోదరుడు రాన్నా హీరోగా తెరకెక్కిన సినిమా ఏలుమలై. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఏలుమలై టీజర్‌ను కన్నడ స్టార్ హీరో, కరుణాడ చక్రవర్తిగా పిలిచే శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jul 11, 2025, 11:16:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

రవితేజ కెరీర్‌లో ఇడియట్ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇడియట్ సినిమాతో హీరోయిన్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది రక్షిత. హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఏలుమలై. ఇందులో ప్రియాంక ఆచార్ హీరోయిన్‌గా చేయగా సీనియర్ హీరో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు.

యథార్థ సంఘటనల ఆధారంగా

రవితేజ ఇడియట్ హీరోయిన్ రక్షిత సోదరుడు హీరోగా ఏలుమలై- పూరి జగన్నాథ్‌తో టీజర్, కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో పోస్టర్ రిలీజ్
రవితేజ ఇడియట్ హీరోయిన్ రక్షిత సోదరుడు హీరోగా ఏలుమలై- పూరి జగన్నాథ్‌తో టీజర్, కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో పోస్టర్ రిలీజ్

తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన సినిమానే ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బెంగళూరులో గ్రాండ్ ఈవెంట్

ఏలుమలై మూవీ టైటిల్ టీజర్‌ను గురువారం (జులై 11) రిలీజ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని ఓరియన్ మాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ టీజర్‌ను కరుణాడ చక్రవర్తి, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆవిష్కరించారు.

పూరి జగన్నాథ్‌తో టీజర్

డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ ఏలుమలై టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు, హీరోయిన్ రక్షిత భర్త జోగి ప్రేమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శివరాజ్ కుమార్ కామెంట్స్

ఏలుమలై టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ .. "టీజర్ అద్భుతంగా ఉంది. మంచి వ్యక్తులకు మంచి జరుగుతుందని టైటిల్ టీజర్ రుజువు చేస్తుంది" అని అన్నారు.

"రాన్నా చాలా గొప్పగా నటించాడనిపిస్తోంది. ప్రియాంక అస్సలు కొత్త అమ్మాయిలా అనిపించలేదు. కొత్తవారు, న్యూ టాలెంట్ వచ్చి కొత్త చిత్రాల్ని తీయాలి. ఇలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఆదరించి, విజయాన్ని చేకూర్చాలి" అని శివరాజ్ కుమార్ తెలిపారు.

హీరోయిన్ భర్త కామెంట్స్

ఇదిలా ఉంటే, ఈ సినిమాను కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబుతోపాటు నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe